శ్రియకి బాగా తీరింది!?

By Staff

Shriya
నిన్నటివరకూ అన్నీ హాలీవుడ్,బాలీవుడ్ ఆఫర్స్ అంటూ తిరిగిన శ్రియ ఇప్పుడిప్పుడే దారికొస్తోందంటున్నారు చెన్నై వాసులు. ఆమె భారీ పబ్లిసిటీ చేసుకున్న హాలీవుడ్ చిత్రం తుస్సుమంది. అందులోనూ అదో లో బడ్జెట్ చిత్రం అనీ వాళ్ళే శ్రియను క్యాష్ చేసుకోవటానికి అన్నట్లుగా పబ్లిసిటీ రిలీజ్ సాగాయి. ఇత పోనీ బాలీవుడ్లో వెలగబెడదామని బొడ్డు క్రింద చూపి మరీ రెచ్చిపోయినా అక్కడా వర్కవుట్ కాలేదు. దాంతో మర్మయోగికి కమిట్ అయితే త్రిష కి పెద్ద పాత్ర ఇచ్చి ఆమెకు పెద్ద పాత్ర ఇవ్వలేదని తెలుస్తోంది.

మరో ప్రక్క విక్రమ్ తో చేసిన మల్లన్న రికార్డులు తిరగరాస్తాడనుకుంటే అసలు ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని బయటపడతాడే తెలియని స్ధితిలో ఉంది. ఈ పరిస్ధితిల్లో త్వరపడకపోతే ఫలితం చాలా దారుణంగా ఉంటుందని ఊహించిన ఆమె విశాల్ కొత్త సినిమా Thoranai లో హీరోయిన్ గా ఒప్పుకుంది. ఇంతకు ముందు సెల్యూట్ సినిమాకు కూడా విశాలు పాపం అడిగాడు. అయితే అప్పటికి భ్రమలు ఇంకా తీరకపోవటంతో విశాల్ తో నాకు పనేంటనుకుని డేట్స్ ప్లాబ్లమ్ అని చెప్పింది.

ఇప్పుడు మూసుకుని ఈ చిత్రంకు కమిటవ్వటంతో కోలీవుడ్ వాసులు తిక్క కుదిరందని అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ మూడు నుండి ప్రారంభమవుతోంది. గతంలో విశాల్ తో భయ్యా చిత్రాన్ని రూపొందించిన భూపతి పాండ్యన్ శిష్యుడు అయ్యప్పన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడప. జి.కె ఫిల్మ్స్ కార్పోరేషన్ పై విక్రమ్ కృష్ణ నిర్మించనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇదే ఊపులో ఎవరైనా మన తెలుగు దర్శకులు శ్రియని అడిగితే కాదనదని కొందరు ధైర్యం చేయబోతున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X