విశాల్, అనీషా ఎంగేజ్మెంట్.. సీక్రెట్‌గా హైదరాబాద్‌కు, అతిథులు వీళ్ళే!

Recommended Video

Vishal and Anisha Engagement In Hyderabad || Vishal || Ayogya || Filmibeat Telugu

తమిళ హీరో విశాల్ వివాహానికి సిద్దమవుతున్నాడు. విశాల్, అనీషాల నిశ్చితార్థ వేడుక నేడు హైదరాబాద్ లో జరగనుంది. కొన్ని రోజుల క్రితమే తాను హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనిషాతో ప్రేమలో ఉన్నట్లు విశాల్ ప్రకటించాడు. అంతకు ముందు వరకు విశాల్ లవ్ ఎఫైర్స్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. వాటన్నింటికి తెరదించుతూ విశాల్, అనిషా జంట నిశ్చితార్థానికి సిద్ధం అవుతోంది.

నిశ్చితార్థ వేడుక

నిశ్చితార్థ వేడుక

విశాల్, అనిషా కుటుంబ సభ్యులు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన వివరాలని గోప్యంగా ఉంచారు. కొద్దిమంది బంధు మిత్రుల మధ్య మాత్రమే నిశ్చితార్ధని ప్రైవేట్ ఈవెంట్ గా జరపనున్నారు. హైదేరాబద్ లోనే ఖరీదైన ఓ స్టార్ హోటల్ లో నిశ్చితార్థం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాల్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చేరుకున్నారు.

అతిథులు వీళ్ళే

అతిథులు వీళ్ళే

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే విశాల్ నిశ్చితార్ధానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం. సీనియర్ నటి ఖుష్బూ, ఆమె భర్త సుందర్, నడిగర్ సంఘంలోని కొందరు సభ్యులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత విశాల్ తన మ్యారేజ్ డేట్ ని ప్రకటించనున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలోని విశాల్ స్నేహితులు కూడా కొందరు నిశ్చితార్థానికి అతిథులుగా హాజరు కానున్నారు.

అంతా ప్లాన్ ప్రకారం

అంతా ప్లాన్ ప్రకారం

విశాల్ కుటుంబ సభ్యులు ముందుగా నిచితార్థ వేడుకకు ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా కేవలం కొద్దిమంది స్నేహితులు, బంధువుల సమక్షంలోనే సింపుల్ గా నిశ్చితార్థాన్ని ముగించాలని భావించారు. అనీషాతో విశాల్ తన రిలేషన్ షిప్ ప్రకటించక ముందు వరకు అతడిపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ముడిపెడుతూ రూమర్స్ క్రియేట్ చేశారు.

తెలుగు, తమిళ భాషల్లో

తెలుగు, తమిళ భాషల్లో

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. విశాల్ కుటుంబ సభ్యులు తెలుగువారే. విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్ అయోగ్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే విశాల్ తమిళ చిత్రపరిశ్రమ నడిగర్ సంఘంలో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. నిర్మాతల మండలికి విశాల్ అధ్యక్షుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X