మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశాల్.. 10ఏళ్ళ తరువాత..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా విశాల్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో అదే తరహాలో తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక్కడ మీడియామ్ రేంజ్ హీరోల మాదిరిగా ఒక మార్కెట్ సెట్ చేసుకున్న ఈ హీరో అప్పుడప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలని కూడా అడుగులు వేస్తున్నాడు. ఆ మధ్య పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం కూడా ప్రయత్నం చేసినట్లు టాక్ వచ్చింది.

కానీ విశాల్ సౌత్ లో తప్పితే నార్త్ లో ఇంకా కొంత కూడా క్రేజ్ అందుకోలేదు. అందుకే ముందుగా సౌత్ ఇండియన్ భాషలపై వీలైనంత వరకు పట్టు సాధించాలని చూస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ యాక్షన్ హీరో ఒక మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం బాలా దర్శకత్వంలో అవన్ ఇవన్ (వాడు వీడు) అనే సినిమా చేసిన విశాల్ ఆర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ ఒక బిగ్ బడ్జెట్ సినిమా కోసం ఆర్యతో కలిసి నటించనున్నాడట.

Vishal another multi starrer movie with arya after 10 years

విజయ్ దేవరకొండతో నోటా అనే సినిమా చేసిన ఆనంద్ శంకర్ వీరి మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేయనున్నాడట. ద్విభాషా చిత్రంగా ఆ ప్రాజెక్టును రూపొందించాలని అనుకుంటున్నట్లు టాక్. మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ఇక గత ఏడాది నాని, విశాల్ కాంబినేషన్ లో కూడా ఒక మినీ మల్టీస్టారర్ ఉంటుందని కథనాలు వెలువడ్డాయి. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ వారి కోసం ఒక కథను కూడా రెడీ చేసినట్లు తెలిసింది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X