»   » శరత్ కుమార్‌తో ఢీ అంటే ఢీ: కోర్టు కెక్కిన హీరో విశాల్

శరత్ కుమార్‌తో ఢీ అంటే ఢీ: కోర్టు కెక్కిన హీరో విశాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్న: ఇటీవల తెలుగు నటీనటుల సంఘం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికల సమయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలు, కోర్టు కేసులు అంటూ ఓ నెల రోజుల పాటు ఒకటే హడావుడి. చివరకు ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ‘మా'అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

తాజాగా తమిళ నటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. నడిగర్ సంఘం ఎన్నికలపై హీరో విశాల్ కోర్టుకెక్కారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోటీలో విశాల్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం.

Vishal approached madras high court on Nadigar Sangam election

గత కొంత కాలంగా శరత్ కుమార్, విశాల్ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. శరత్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గంపై నటుడు విశాల్ మాత్రమే కాదు.... సీనియర్‌ నటుడు నాజర్‌ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసారు. విశాల్‌ పోటీ చేస్తానంటే ఎదుర్కొనేందుకు తానూ సిద్ధమేనని, అయితే విశాల్‌ తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

నడిగర్ సంఘం భవన నిర్మాణం విషయంలో పెద్ద గొడవే సాగుతుందని.... ఆ పరిణామాలే ఇపుడు విశాల్ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చేస్తున్నాయని, నాజర్ కూడా ప్రస్తుత సంఘం తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నూతన భవనం నిర్మాణం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని నాజర్ కోరుతున్నారు. విశాల్‌ మాట్లాడుతూ... భవన నిర్మాణానికి సంబంధించి న్యాయబద్ధమైన సమాధానం దొరకలేదని, అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీచేసేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు.

English summary
Tamil actor Vishal approached madras high court on Nadigar Sangam election.
Please Wait while comments are loading...