విశాల్...సూపర్ మెన్

'క్రిష్'సినిమా స్క్రిప్టు పరంగా ఏవరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ లో సంచలన రికార్డులు సృష్టించింది.ఇప్పుడు విశాల్ అలాంటి సినిమాను తన తొలి దర్శక ప్రతిభను నిరూపించుకోవటానికి ఎన్నుకోవటం హర్షనీయమే.కానీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ తో నిండి ఉండటంతో ఆ విభాగానికే పేరు వస్తుంది.అందులోనూ ఈ తరహా పాత్రలు ప్రేక్షకులకు కొత్త కాకపోవటం మరో మైనస్ .అయినా రిటన్స్ పరంగా మంచి మార్గం కావటం దీనికున్న పెద్ద ప్లస్ పాయింటు.అదే డబ్బు విషయంలో పూర్తి నిక్కచ్చిగా ఉండే విశాల్ కి నచ్చిఉండవచ్చు.
ఇక అతని బైలింగ్వల్ చిత్రం 'సెల్యూట్' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాజశేఖర్ రూపొందించారు. విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.రాజశేఖర్ గతంలో ఇండియాటుడే లో పనిచేసారు. అందుకే సినిమా మొత్తం వాస్తవిక సంఘటనలతో ఉంటుందిట.అలాగే ఐస్ క్రీమ్స్ లో డ్రగ్స్ పెట్టి అమ్మే కల్చర్ ఈ సినిమాలో కనిపిస్తుంది.అంతేగాక ఈ సినిమా సెకెండాఫ్ లో వచ్చే పెద్ద ఛేజింగ్ సీన్ సినిమాను ఎక్కడికో తీసకెళ్తుందని దర్శక,నిర్మాతలు నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications











