మాస్ ఇమేజ్ ని బ్రేక్ చేయాలని ఆత్రుతతో నపుంసక హీరో...!?
ప్రతి సినిమాలోను హీరో చేత ఏదో ఒక విచిత్ర వేషం వేయించే అలవాటున్న తమిళ దర్శకుడు బాలా తొలిసారి తన శైలికి భిన్నంగా పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ ని 'అవన్ ఇవన్" పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విశాల్, ఆర్య కథానాయకులుగా నటిస్తున్నారు. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తీస్తే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడో ఏమో, హీరో విశాల్ ని ఇందులో నపుంసకుడిగా చూపిస్తున్నాడు.
విజయాలు లేక డీలా పడ్డ విశాల్ ప్రస్తుతం తనకు ఏర్సడిన మాస్ ఇమేజ్ ని ఎలాగైనా బ్రేక్ చేయాలని చాలా కాలంగా తంటాలు పడుతున్నాడు. దానికి అసలైన ఛాయిస్ బాలానే అనుకుని అతను అవకాశమిస్తాననగానే మారు మాట్లాడకుండా ఓకే అనేశాడు. సూర్యకి 'నందా" సినిమాతో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది, 'సేతు" తో విక్రమ్ ని హీరోగా నిలబెట్టి, 'పితామగన్" తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలిచేట్టు చేసిందీ బాలానే కావడంతో తనకి కూడా అలాంటి గొప్ప సినిమానిస్తాడని ఆశించిన విశాల్, బాలా మీద గౌరవంతో నపుంసక పాత్రని నమ్మకంగా చేసేస్తున్నాడు. ఇంకా ఈ చిత్రంలో ఆర్య కూడా ప్రదాన పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.
మరి ఈ సినిమా విశాల్ కోరుకుంటోన్న కొత్త ఇమేజ్ ని తెస్తుందో, లేక మగధీరుడిగా ప్రస్తుతమున్న ఇమేజ్ ని కూడా చెడగొట్టి మాయని మచ్చగా మిగిలిపోతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











