విశాల్ కి బుద్ది వచ్చిందా?
విశాల్ కి వరసగా సెల్యూట్, పిస్తా సినిమాలు ప్లాఫ్ కావటంతో కాస్త కళ్ళు క్రిందకి దిగాయని అంటున్నారు. కథ నుంచి దర్శకత్వం వరకూ అన్ని విషయాల్లోనూ వేలు పెట్టి తన చేతులారా తన స్వంత ప్రాజెక్టులను పాడుచేసుకుంటున్నాననే సంగతి రియలైజ్ అయ్యాడంటున్నారు. అంతేగాక తన పరాజయానికి కారణం తను ఎన్నుకునే స్క్రిప్టులు బలంగా లేకపోవటమేనని చెప్తున్నారు. అందుకే ఎవరయినా కొత్త వారు కథలు పట్టుకొచ్చినా, స్టోరీ లైన్స్ తెచ్చుకున్నా ఎంకరేజ్ చేస్తానని బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. తనకు తెలిసున్న వారికి కథలున్న వారిని పంపమని చెప్పాడని తెలుస్తోంది. ఆ మధ్య పందెం కోడి వంటి తమిళ సినిమాలు బాగా ఆడటంతో తనపై తనకు నమ్మకం పెలిగి డైరక్టర్స్ ని టార్చర్ పెట్టడమే ఈ ప్లాప్స్ కి కారణమంటున్నారు. ఆ మధ్య భరణి చిత్రం దర్శకుడు అయితే స్టేజిపై విశాల్ ని తన ఫ్లాఫ్ కి కారణమని నిందించటం జరిగింది. మరికొందరైతే తమకు డబ్బు ఎగ్గొట్టారని, త్రిప్పుకుంటున్నారని వాపోయారు. వీరందరి ఉసురు అతనికి తగిలే ఫ్లాఫ్ లు వస్తున్నాయని తమిళంలో కొందరు సీనియర్స్ విమర్శిస్తున్నారు. ఆ కోణంలో కూడా విశాల్ ఆలోచిస్తే మేలు.


Click it and Unblock the Notifications











