twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి డైరెక్టర్‌ అవసరమా? కన్నబిడ్డను అనాథాశ్రమంలో వదిలేసినట్టే.. విశాల్ షాకింగ్ కామెంట్స్

    |

    హీరో, నిర్మాత విశాల్-దర్శకుడు మిస్కిన్ మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమనేలా ఉంది వ్యవహారం. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తుప్పరివాలన్ (డిటెక్టివ్) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆ మూవీకి సీక్వెల్‌ను కూడా ప్లాన్ చేశారు. రీసెంట్‌గానే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే అంతలోనే ఈ మూవీ నుంచి దర్శకుడు మిస్కిన్‌ను తప్పించేశాడు విశాల్. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. విశాల్‌పై మిస్కిన్ సెటైర్లు వేయడం, విశాల్ కూడా స్పందించడం అప్పట్లో తెగ వైరల్ అయింది.

    విశాల్‌పై సెటైర్లు..

    విశాల్‌పై సెటైర్లు..

    తనను తుప్పరివాలన్ 2 నుంచి తప్పించడంపై మిస్కిన్ కౌంటర్లు వేశాడు. తాను సినిమా కోసం 40కోట్లు అడగలేదని 400కోట్లు అడిగానని, సెటైర్లు వేశాడు. ఈ ఘటనపై విశాల్ స్పందిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించాడు.

    అలాంటి దర్శకుడు అవసరమా..?

    అలాంటి దర్శకుడు అవసరమా..?

    ఓ దర్శకుడిని సినిమా మధ్యలోంచి తీసేయడానికి కారణాలు ఏమై ఉంటాయా? అంటూ ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశాడు. కథ, స్క్రిప్ట్ రాయడానికి కెనడా, యూకేలకు వెళ్లే దర్శకుడిని చూసే ఆశ్చర్యపోయాను. దాదాపు 35 లక్షలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేసి ఓ ప్లానింగ్, లొకేషన్స్ సెలెక్ట్ చేయకుండా షూటింగ్ మొదలెట్టేసి.. దాదాపు 13 కోట్లు వృథాగా ఖర్చు పెట్టించే దర్శకుడు అవసరమా? అంటూ ప్రశ్నించాడు.

     కన్నబిడ్డలను అనాథ ఆశ్రమంలో వదిలేసినట్టే..

    కన్నబిడ్డలను అనాథ ఆశ్రమంలో వదిలేసినట్టే..

    నా దగ్గర డబ్బుల్లేక సినిమాను ఆపేశానా? కాదే.. విదేశాల్లో షూటింగ్ చేయాలంటే.. ఒక్క పూటకు దాదాపు 15లక్షలు ఖర్చవుతుంటే.. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఒక్క రోజులో రెండు సీన్స్ తీద్దామని లేదా పగలు రాత్రి షూటింగ్ చేద్దామని అడగడం తప్పా అంటూ ప్రశ్నించాడు. అలా చూసీ చూడకుండా ఉంటే సొంత బిడ్డను అనాథాశ్రమంలో వదిలేసినట్టే అంటూ చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Vishal And Anisha Reddy Marriage Has Been Canceled??
    మధ్యలో వదిలేయలేను..

    మధ్యలో వదిలేయలేను..

    ఇదంతా ఒకరిని ప్రతిష్టను తగ్గించేందుకు చెప్పడం లేదని నిర్మాతల కష్టాలు, కొత్తగా వచ్చే నిర్మాతలు తెలుసుకుంటారని చెబుతున్నానంటూ పేర్కొన్నాడు. ఇలా మరో నిర్మాతకు ఎదురు కాకూడదని, మధ్యలో చిత్రాన్ని వదిలేయలేక తానే దర్శకత్వం వహిస్తున్నానని తెలిపాడు. డైరెక్టర్‌గా తన తొలి ప్రయత్నానికి అందరి ఆశీర్వాదం కావాలని, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

    English summary
    Mysskin Out From Thupparivaalan 2 And Vishal Directs Remaining Part. Beacause Of Budget Issue There Is Difference Came Between Mysskin And Vishal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X