Just In
- 20 min ago
మోక్షజ్ఞ ఎంట్రీపై సెన్సేషనల్ న్యూస్ లీక్: లాంఛ్ చేసేది ఆ డైనమిక్ డైరెక్టరే.. బాలయ్య ప్లాన్ అదుర్స్!
- 1 hr ago
ప్రముఖ కెమెరామెన్‌పై అర్జున్ రెడ్డి నటి ఫిర్యాదు: టాలీవుడ్లో మరోసారి రచ్చ లేపిన వ్యవహారం
- 2 hrs ago
రెచ్చిపోతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్: మొన్న ఏపీ సీఎంపై.. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేపై.. బలిసి మాట్లాడితే!
- 3 hrs ago
మా ఆయన దగ్గరున్నదే ఇష్టమన్న అనసూయ: యాంకర్ పర్సనల్ మేటర్ లీక్ చేసి షాకిచ్చిన రోజా
Don't Miss!
- News
యూకే కొత్త కరోనా స్ట్రెయిన్ అత్యంత ప్రాణాంతకం, అధిక మరణాలకు ఛాన్స్ : బోరిస్ జాన్సన్
- Sports
అభిమానులకు నిరాశే.. ప్రేక్షకుల్లేకుండానే తొలి రెండు టెస్టులు!!
- Automobiles
డిసెంబర్లో భారత్ నుండి అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-10 కార్లు
- Lifestyle
True Love Story : ప్రియురాలి కోసం ఇండియా నుండి యూరప్ కు సైకిల్ పై వెళ్లాడట...! మరి తన ప్రేమ సక్సెస్ అయ్యిందా..
- Finance
రిలయన్స్ 'జియో' అదరగొట్టింది: జియో ఆదాయం సూపర్, పెట్రో వ్యాపారం ఓకే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విశాల్ పెళ్లి ఆగిపోయినట్లే: మరొకరితో నిశ్చితార్థం చేసుకున్న ‘అర్జున్ రెడ్డి’ భామ
తమిళ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో విశాల్ ఒకడు. సినిమా పరంగానే కాకుండా సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తన స్పందనను అందిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడీ హీరో. తన ప్రతి సినిమానూ తెలుగులో కూడా విడుదల చేస్తూ.. తమిళంతో పాటు మన దగ్గరా మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి గురించి మరో న్యూస్ లీకైంది.
విశాల్ ఆ మధ్య హైదరాబాద్‌కు చెందిన అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ వేడుక రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. ఇది జరిగి చాలా రోజులు కావొస్తున్నా.. వీళ్లిద్దరి పెళ్లి గురించి మాత్రం అప్‌డేట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనీషా రెడ్డి.. తాజాగా మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందని తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె నిశ్చితార్థం కూడా అయిపోయిందని అంటున్నారు. విశాల్‌తో పెళ్లి రద్దు అవడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి'లో కీలక పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది అనీషా రెడ్డి. మరోవైపు, విశాల్ గతంలో సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో ప్రేమాయణం సాగించాడు. చాలా రోజుల పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ పరిణామం తర్వాతనే విశాల్.. అనీషాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. కానీ, ఈ బంధాన్ని కూడా పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లలేకపోయాడు.