వీడియో షాపుపై దాడి: పైరసీ ని పట్టుకున్న హీరో(వీడియో)

By Srikanya

చెన్నై : సినిమా మనుగడకు శాపంగా మారింది పైరసీ. ఆన్ లైన్ పైరసీపై ఓ ప్రక్క అన్ని జాగ్రత్తలు తీసుకుంటూంటే మరో ప్రక్క వీడియో షాపుల ద్వారా పైరసీ పెరిగిపోతోంది. దీన్ని అరికొట్టాలని దర్శక,నిర్మాతలు, హీరోలు చాలా కాలం నుంచీ ప్రభత్వాన్ని కోరుతున్నారు. అయినా ఫలితం లేదు. ఈ నేపధ్యంలో హీరోలే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. తాజాగా హీరో విజయ్ తన చిత్రం పూజ గురించి రంగంలోకి దిగారు. తమిళనాడులోని తిరుప్పూరు లో ఓ వీడియో షాపు లో పైరసీ సీడిలను పట్టుకున్నారు. ఇదిగో మీరూ చూడండి.

విశాల్, శృతిహాసన్ జంటగా హరి దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మించిన్న ‘పూజ' చిత్రం వారం క్రితం విడుదల అయ్యింది. ''కొన్ని సినిమాలు 'ఏ' క్లాస్‌ల్లో బాగా ఆడతాయి. ఇంకొన్ని సినిమాలు బి, సీల్లో బాగా ఆడతాయి. కానీ... మా 'పూజ' అన్ని క్లాసుల్లో బాగా ఆడుతోంది. ఎక్కువ థియేటర్లలో నా సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం'' అని విశాల్ అన్నారు. హరి దర్శకత్వంలో విశాల్ నటించి, నిర్మించిన తమిళ చిత్రం'పూజై'. ఈ సినిమా 'పూజ' పేరుతో గురువారం తెలుగులో విడుదలైంది.

Vishal fights against piracy for Kaththi and Poojai

విశాల్ మాట్లాడుతూ.... ''హరితో ఏడేళ్ల క్రితం 'భరణి' చేశాను. మళ్లీ ఇన్నాళ్లకు తనతో పనిచేసే అవకాశం చిక్కింది. ఇద్దరం కలిసి సినిమా చేద్దామనుకున్నప్పుడే కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే కథ కావాలని తనతో చెప్పాను. అనుకున్నట్టే అందరికీ నచ్చే కథ తయారు చేశాడు. ఇప్పుడు అన్ని చోట్లా మంచి స్పందన వస్తోంది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఏదైతే హైలైట్ అవుతాయని అనుకున్నానో అవన్నీ హైలైట్ అవ్వడం ఆనందంగా ఉంది. రాధిక, సత్యరాజు కాంబినేషన్ సన్నివేశాలు, సంభాషణలు బాగా పండాయి. హరితో తప్పకుండా మళ్లీ ఓ సినిమా చేస్తాను'' అని చెప్పారు.

విశాల్ మంచి నటుడే కాక మంచి నిర్మాత కూడా అనీ, యాక్షన్ సీన్స్ బాగా రక్తి కట్టించారనీ హరి ప్రశంశిచారు. ఈ చిత్రంలో సత్యరాజ్, రాధిక, అభినయ, జయప్రకాశ్, మనోబాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, ఫైట్స్: కనల్ కన్నన్, నిర్మాత: విశాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X