శ్రియను ఫాలో అవుతున్న విశాల్
కొంత కాలం క్రిందట కథానాయిక శ్రియ మనశ్శాంతి కోసం హిమాలయాలను సందర్శించిందన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'శివాజీ' చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆయన నుంచీ తానీ విషయం తెలుసుకొని హిమాలయాలకు వెళ్లిందన్న గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం శ్రియతో 'పిస్తా' చిత్రంలో నటించిన విశాల్ ఆమె ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాడో లేదా ఎవరైనా సలహా ఇచ్చారో తెలీదు కానీ వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతూ మనశ్శాంతి కోసం హిమాసయాలకు వెళ్లాడట.
కనీసం ఈ పర్యటనతోనైనా ఆయన జాతకం మారనుందేమో చూడాలి. ఇంకో విషయం ఏంటంటే విశాల్ తన తర్వాతి చిత్రంలో శ్రియనే నాయికగా తీసుకోమని రెకమెండ్ చేసి మరీ ఒప్పించాడట నిర్మాతని. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య ''సంథింగ్ సంథింగ్'' వుందన్న వార్తలు చెన్నై వీధుల్లో షికారు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











