twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో విశాల్‌కు 'తమిళ్ రాకర్స్'తో సంబంధాలు.. అతడొక క్రిమినల్, 2.0 లీక్ వెనుక!

    |

    హీరో విశాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విశాల్ తమిళ నిర్మాతలు మండలికి అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది తమిళ ప్రొడ్యూసర్స్ విశాల్ అధ్యక్షుడిగా ఉండడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్నటి నుంచి చెన్నైలోని టినగర్ లో ఉండే నిర్మాతలు మండలి ఆఫీస్ ఎదుట విశాల్ కు వ్యతిరేకంగా నిర్మాతలంతా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని, సొంత పనులు చక్కబెట్టుకుంటున్నాడని కొంతమంది తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

    తమిళ్ రాకర్స్‌తో సంబంధాలు

    తమిళ్ రాకర్స్‌తో సంబంధాలు

    హీరో విశాల్ పై తమిళ నిర్మాత అళగప్పన్ సంచలన ఆరోపణలు చేశారు. విశాల్ ఒక క్రిమినల్. అతడు చాలా క్రిమినల్ చర్యల్లో ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు విన్నాను. అతడికి పైరసీ సంస్థ తమిళ్ రాకర్స్ తో సంబంధాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమిళ్ రాకర్స్ అనేది సామాన్యమైనది కాదు. ఈ ఏడాది విడుదలైన పెద్ద చిత్రాలన్నింటిని చెప్పి మరి లీక్ చేసింది. ఇండస్ట్రీ ప్రముఖుల సహకారం లేకుండా ఇలా ఎలా జరుగుతుంది అని అళగప్పన్ విశాల్ ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

    రజని 2.0 లీక్

    రజని 2.0 లీక్

    ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం 2.0. ఈ చిత్ర పైరసీ విడుదల రోజే లీక్ చేస్తామని తమిళ్ రాకర్స్ ప్రకటించింది. విడుదలరోజే అన్నంతపని చేసింది. కానీ తమిళ్ రాకర్స్ ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. మరో వైపు అమిర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ పరిస్థితి కూడా అంతే. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు సైతం తమిళ్ రాకర్స్ సంస్థకు బలవుతున్నాయని అళగప్పన్ తెలిపారు. విశాల్ పైకి పైరసీని నిరోధించడానికి కృషి చేస్తున్నట్లు నటిస్తూ లోపల తమిళ్ రాకర్స్ తో కుమ్మక్కయ్యాడని, అందులో అతడికి వాటా ఉందని ఆరోపించారు.

    విశాల్ సొంతంగా

    విశాల్ సొంతంగా

    కర్ణాటకలో అక్కడని నిర్మాతల మండలి తమిళ డబ్బింగ్ చిత్రాల్ని విడుదల కానివ్వడం లేదు. కానీ విశాల్ మాత్రం ఇక్కడ కన్నడ డబ్బింగ్ చిత్రం కెజిఎఫ్ ని సొంతంగా విడుదల చేస్తున్నాడు. ఈ వ్యవహారం చాలా మంది తమిళ నిర్మాతలకు నచ్చలేదు. జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని కోరినా విశాల్ తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ తన సొంత కార్యక్రమాలే తప్ప విశాల్ కు ఇలాంటి ముఖ్యమైన పనులు పట్టవని అళగప్పన్ ఆరోపిస్తున్నారు.

    ఎవరెవరో వస్తున్నారు

    ఎవరెవరో వస్తున్నారు

    ఇదిలా ఉండగా నిర్మాతల మండలి కార్యాలయం తాళం వేయడంతో విశాల్ కు, పోలీసులుకు మధ్య వాగ్వాదం జరిగింది. విశాల్ తాళం బద్దలు కొట్టి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ ఎవరో అనధికారిక వ్యక్తులు ఆఫీస్ తాళం వేశారు. ఆఫీస్ ప్రాపర్టీ పోతే ఎవరు భాద్యత వహించాలి అని ప్రశ్నించాడు. కొంత గందరగోళం తరువాత పోలీసులు విశాల్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    Vishal has a share in TamilRockers piracy website. Producer Azhagappan claims
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X