విశాల్ హీరోయిన్ లిప్ లాక్ ఫోటో వైరల్.. 13 ఏళ్ల తరువాత ఇంత షాక్ ఇచ్చిందేంటి!
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా వెలిగిన కొంత మంది బ్యూటీలను అక్కడి ఆడియెన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇక అక్కడ హీరోలు తెలుగులో కూడా రెగ్యులర్ గా సినిమాలు చేస్తుంటారు కాబట్టి మన వాళ్లకు కూడా తమిళ హీరోయిన్స్ ని బాగానే అలవాటు చేశారు. ఇక అప్పట్లో తన అందంతో ఎంతగానో ఆకట్టుకున్న భాను ముక్త చాలా రోజుల తరువాత ఊహించని విదంగా దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో లిప్ లాక్ తో కనిపించడం వైరల్ అవుతోంది.

భరణి సినిమాతో గట్టిగానే గిల్లేసింది..
విశాల్ నటించిన భరణి(2007) సినిమా తెలుగులో అప్పట్లో బాగానే ఆడింది. ఇక అందులో నటించిన హీరోయిన్ భాను కూడా తన అందంతో నటనతో కుర్రాళ్ళ మనసులను గట్టిగానే గిల్లేసింది. ముఖ్యంగా భరణి సినిమాలో నలుపైనా కన్నయ్యా పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

లిప్ లాక్ ఫోటో వైరల్
ఇక ఆ విధంగా తమిళ్ తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న భాను చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో లిప్ లాక్ కి సంబంధించిన ఫొటో పోస్ట్ చేసింది. ఇక ఆమె ముద్దును అందుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు. ఆమె భర్తే. సింగర్ రిమి టామీ సోదరుడైన రింకు టామీని 2015లో భాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అతను రావడం నా అదృష్టం..
ఇక రీసెంట్ గా వారి వివాహం జరిగి ఐదేళ్లు కావడంతో లిప్ లాక్ ఫోటో పోస్ట్ చేసి హ్యాపీ యానివర్సరీ అంటూ తన భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. తనతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం అంటూ తనే నా సర్వస్వమని కూడా వివరణ ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ తో ఆకట్టుకుంటోంది.

28 ఏళ్లకే సెకండ్ ఇన్నింగ్స్..
భాను భరణి సినిమా చేస్తున్నప్పుడు వయసు 16 ఏళ్ళు మాత్రమే. అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సీరియల్స్ లలో నటించింధి. అయితే హీరోయిన్ గా మాత్రం ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రస్తుతం ఆమె వయసు 28. ఇక హీరోయిన్ గా కాకుండా సినిమాల్లో పవర్ఫుల్ సపోర్టింగ్ పాత్రల్లోనే నటించాలని ఈ బ్యూటీ సరికొత్తగా అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications











