రజనీకాంత్ కి సెటైర్ విసిరిన విశాల్
సూపర్ స్టార్ రజనీకాంత్ ..హిమాలయ యాత్రకు సెటైర్ విసిరి అందరి నోళ్ళలో నానుతున్నాడు విశాల్. ఈ మధ్య వరస ఫ్లాఫుల్లో ఉండి వెనకపడ్డ విశాల్ తన కన్నా పెద్ద వారిపై రాళ్ళు విసిరితే ముందుకొచ్చి పేరు వినపడుతుందనుకున్నాడో ఏమో గానీ రజనీకాంత్ పై కామెంట్ చేసాడు. ఈ మద్య హిమాలయాలకు వెళ్ళిన విశాల్ ని మీడియా వారు మీరు ఆధ్యాత్మిక కోసం హిమాలయాలు వెళ్లారా అంటే...అది ఓ ఎడ్వెంచర్ ట్రిప్..నేను మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే హిమాలయాలకు వెళ్ళను..నా ఇంట్లోనే చేసుకుంటాను అని చెప్పాడు. ఇక తన తాజా చిత్రం తీర్ధ విలయట్టు పిళ్ళై ..సంక్రాంతి రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ టాపిక్ వచ్చింది. చెన్నై లోని గ్రీన్ పార్క్ లో ఈ మీడియా మీట్ జరిగింది. ఇక ఈ చిత్రంలో తన పాత్ర ప్రక్కింటి కుర్రాడులా నిజజీవితానికి దగ్గరగా ఉంటుందంటూ ఎప్పటి పాటే పాడి ముగించాడు.
విశాల్ సెల్యూట్ నయనతార హిమాలయం రజనీకాంత్ భరణి పందెం కోడి vishal selute nayantara rajinikanth bharani pandem kodi


Click it and Unblock the Notifications