పిట్టల దొర హీరో విశాల్!
ఫైట్లు ఎన్ని చేసినా జనం ఛీకొడుతున్నారని చిరాకొచ్చి విశాల్ ఇప్పుడు పిట్టలని కొట్టే పని చేపట్టాడు! ఈ తమిళ నల్లపయ్య ఇప్పుడు కంప్లీట్ గా ట్రాక్ మార్చి ప్లేబాయ్ వేషం కట్టాడు. 'తీరద విలయాడు పిళ్లై" అనే చిత్రంలో విశాల్ ముగ్గురు అందమైన భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. తనూశ్రీదత్తా, సరహ్ జానే, నీతూ చంద్రతో పాటు మరో కొత్త అమ్మాయితో విశాల్ సాంగులేసుకుంటున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ లో గత ఏడాది వచ్చిన 'బచ్ నా యే హసీనా" కి రీమేక్ కావడం గమనార్హం. తెలుగు, తమిళ భాషల్లో పాపులారిటీ సంపాదించిన విశాల్ ఇప్పుడు తనలోని కొత్త యాంగిల్ ని చూపించేందుకు కంకణం కట్టుకున్నాడు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజ మంచి సంగీతాన్ని అందించనున్నారు. ఈ ఫైటింగుల వీరుడుకి 'పిట్టల" దొర వేషం ఎంత వరకు సూటవుతుందో సినిమా విడుదలయ్యాకే తెలియాలి.
విశాల్ తనూశ్రీ దత్తా సరహ్ జానే నీతూ చంద్ర తిరు యువన్ శంకర్ రాజ తీరద విలయాడు పిళ్లై vishal tanushree dutta sarah jane neetu chandra thiru yuvan shankar raja theeradha vilaiyattu pillai


Click it and Unblock the Notifications