విశాల్-ఆర్య మధ్య... దోస్తానా!
వాడు-వీడు సినిమాలో నటించిన విశాల్, ఆర్య సూపర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చు కోవడంతో పాటు మంచి కలెక్షన్లు సాధించింది. వరుస ప్లాపులతో సతమతం అయిన విశాల్ కు ఈ సినిమా ఊరటనిచ్చింది. ఈ విషయం పక్కన పెడితే.... ఈ సినిమాకు సంబంధించిన పలు చర్చా కార్య్రకమాల్లో విశాల్ మాటలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. తన కోస్టార్ ఆర్యకు, తనకు మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటూ చెబుతున్నాడు. అంతటితో ఊరుకోకుండా ఆర్యను లవ్ చేస్తున్నాను అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నాడు.
విశాల్ వింత ప్రవర్తనపై కొందరు ఆయన్ను నేరుగా అడిగితే అసలు విషయం బయట పెట్టాడు. 'మా ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఉన్న మాట వాస్తవమే. అయితే అది పెళ్లికి దారి తీసే బంధం కాదు. ఎందుకంటే మేము ఆ..టైపు కాదు. ఒక విషయం మాత్రం వాస్తవం. మేము ఇద్దరం కలిసి దోస్తానా(గే) కథాంశంతో త్వరలో తమిళంలో సినిమా చేయబోతున్నాం అంటూ చెప్పకొచ్చాడు.


Click it and Unblock the Notifications











