హన్సికకి హ్యాండ్ ఇచ్చి లక్ష్మీ మీనన్ తో...
నిజానికి ఈ చిత్రంలో ముందుగా హన్సికనే హీరోయిన్ గా ఎంపిక చేశారట. అధికారక ప్రకటన వెలువడటమే తరువాయి అన్న నేపథ్యంలో పాండియనాడు విడుదలైంది. అందులో విశాల్-లక్ష్మీమీనన్‌ల జంట చక్కగా ఉందని, వీరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందని వార్తలు రావటానికి తోడు.. చాన్నాళ్ల తర్వాత తనకు విజయం రావటాన్ని పరిగణలోకి తీసుకున్నాడట విశాల్. దీంతో నాన్ సిగప్పు మనిదన్‌లోనూ లక్ష్మీమీనన్‌నే హీరోయిన్‌గా ఎంపిక చేయాలని దర్శకుడిని కోరాడట. విశాల్ మాట మేరకే అప్పటి వరకు అనుకున్న హన్సికను పక్కనపెట్టి లక్ష్మీమీనన్‌ను ఎంపిక చేశారట.
హన్సిక విషయానికి వస్తే...'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇప్పటికే నాగచైతన్య, మంచు విష్ణుతో మరో రెండు చిత్రాలకు కమిట్ అయింది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.
హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.సుందర్.సి దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కూడా సిద్ధమైంది. ఇవన్నీ చూస్తుంటే గతంలో చెప్పినట్టుగా పెళ్లిచేసుకొని వెళ్లిపోయే ఆలోచన వాయిదా వేసినట్లు కనపడుతోంది. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు చేసుకుంటూ వెళితే మరో రెండు సంవత్సరాలన్నా సరిపోతాయి. మొత్తానికి పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.


Click it and Unblock the Notifications












