పెళ్లి గురించి విశాల్‌కు చెప్పా, అప్పటి వరకు నో అన్నాడు: వరలక్ష్మి

తమిళ హీరో విశాల్ పేరు వినగానే చాలా మందికి వరలక్ష్మి పేరు కూడా గుర్తుకు వస్తుంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుండటమే ఇందుకు కారణం. వీరి పెళ్లికి ఒప్పుకోక పోవడం వల్లనే నడిగర్ సంఘం విషయంలో విశాల్-శరత్ కుమార్ మధ్య గొడవ జరిగినట్లు ఆ మధ్య సీన్ క్రియేట్ అయింది కూడా.

అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, కేవలం స్నేహితులం మాత్రమే అని ఇటు వరలక్ష్మితో పాటు విశాల్ కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయినా పెళ్లి వార్తలకు తెరపడటం లేదు. వీరు కలిసి నటించిన 'పందెం కోడి 2' విడుదలవ్వడంతో మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విశాల్, వరలక్ష్మికి మరోసారి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

పెళ్లి గురించి విశాల్‌కు చెప్పాను

పెళ్లి గురించి విశాల్‌కు చెప్పాను

ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ‘మీ ఫ్రెండ్ విశాల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అనే ప్రశ్న ఎదురైనపుడు వరలక్ష్మి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. త్వరగా పెళ్లి చేసుకో, ఇంకొన్ని రోజులు గడిస్తే ఎవరూ పిల్లనివ్వరు అని విశాల్‌కు చెప్పాను, అయినా నా మాట వినిపించుకోవడం లేదని తెలిపారు.

అప్పటి వరకు పెళ్లికి నో అన్నాడు

అప్పటి వరకు పెళ్లికి నో అన్నాడు

విశాల్ నడిగర్ సంఘంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నాడు. సంఘానికి భవనం నిర్మించాలనేది అతడి కల. అప్పటి వరకు పెళ్లి చేసుకోను అని ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెబుతుంటాడు అని వరలక్ష్మి తెలిపారు.

 పందెం కోడి2 లో విశాల్ విలన్

పందెం కోడి2 లో విశాల్ విలన్

‘పందెం కోడి 2' చిత్రంలో ప్రతి నాయకి పాత్రలో వరలక్ష్మి నటించారు. తాను విశాల్ సినిమాల్లో కనిపిస్తే అది తప్పకుండా విలన్ పాత్రే అయుంటుందని.... ఇతర పాత్రల్లో కనిపించక పోవచ్చని వరలక్ష్మి స్పష్టం చేశారు.

వరలక్ష్మి

వరలక్ష్మి

వరలక్ష్మి, విశాల్ తమ రిలేషన్ షిప్ విషయంలో ఎన్ని స్టోరీలు చెబుతున్నా...... ఇద్దరి మధ్య బయటకు తెలియని స్నేహబంధాన్ని మించిన బంధం ఏదో ఉందనే వార్తలు ఆగడం లేదు. వీరిలో ఎవరో ఒకరి పెళ్లి అయితే తప్ప ఈ వార్తలు ఆగేలా కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X