»   » మద్దతు కోసం :రజనీ, కమల్‌ కలిసిన విశాల్‌ (ఫొటోలు)

మద్దతు కోసం :రజనీ, కమల్‌ కలిసిన విశాల్‌ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విశాల్‌ జట్టు 'పాండవర్‌'గా పేరు పెట్టుకుంది. ఈ మేరకు వీరు మద్దతు కోరుతూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లతో భేటీ అయ్యారు. సెప్టెంబరు ఒకటోతేదీన నటీనటుల సంఘం ఎన్నికలు జరుగనున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇందులో నటుడు శరత్‌కుమార్‌కు పోటీగా విశాల్‌ బరిలోకి దిగారు. ఆయన జట్టులో సీనియర్‌ నటులు నాజర్‌, పొన్‌వన్నన్‌, కార్తి, కరుణాస్‌ తదితరులున్నారు. వీరు మదురై, తిరుచ్చి తదితర ప్రాంతాల్లో కళాకారుల మద్దతు కోసం కొన్నాళ్లుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు పోయెస్‌గార్డెన్‌లోని గృహంలో రజనీకాంత్‌తో భేటీ అయింది 'పాండవర్‌' జట్టు. రజనీకాంత్‌కు పుష్పగుచ్ఛం అందజేసి తమకు మద్దతు ప్రకటించాలని కోరింది. అనంతరం ఓ సినిమా చిత్రీకరణలో ఉన్న కమల్‌హాసన్‌నూ కలిసింది. భవిష్యత్తు సంక్షేమం కోసం తాము బృందంగా మారామని.. తమకు మద్దతివ్వాలని ఈ సందర్భంగా కోరింది.


స్లైడ్ షోలో ఆ ఫొటొలు

 రజనీని కలిసి...

రజనీని కలిసి...

రజనీకాంత్ ని కలిసి...విశాల్ మద్దతు కోరినప్పుడు...

కమల్ ని కలిసి..

కమల్ ని కలిసి..

కమల్ హాసన్ ని సైతం కలిసి మద్దతు కోరారు

ఉత్సాహంగా రజనీ

ఉత్సాహంగా రజనీ

రజనీకాంత్ ని కలిసినప్పుడు ఉత్సాహంగా మద్దతు ఇస్తామని అన్నారు.

అంతా కలిసి

అంతా కలిసి

కమల్ తో కలిసి టీమ్ అంతా ఫొటో దిగారు

English summary
Actor Vishal has invited both Rajini and Kamal to cast their votes for the Nadigar Sangam elections which will be happening on September 1st.Nassar, Karthi, Ponvannan, Kushboo and Karunas accompanied Vishal in meeting both the senior actors of Tamil film industry.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu