అయోగ్య షూటింగ్‌లో విశాల్‌కు ప్రమాదం
అయోగ్య సినిమా షూటింగ్‌లో హీరో విశాల్ గాయపడ్డారు. ఇప్పటికే పలుమార్లు షూటింగ్‌లో విశాల్ గాయపడ్డారు. 2013లో పూజై, 2014లో అంబాలా సినిమా షూటింగ్‌లో స్వల్ప ప్రమాదానికి గురయ్యాడు. తెలుగులో ఘన విజయం సాధించిన టెంపర్ సినిమాను తమిళంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖాన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా విశాల్ గాయాలపాలు కావడం ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యాడు.
ఆయోగ్య సినిమాలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలోని బ్లాక్ బస్టర్ పాటను పెట్టాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకొన్నది. ఈ నేపథ్యంలో పాటను షూట్ చేస్తుండగా విశాల్‌కు గాయమైంది.

తన గాయం గురించి మీడియాకు వివరిస్తూ.. బ్లాక్ బస్టర్ పాట చిత్రీకరిస్తున్న సందర్భంగా నా కాలు జారి, కిందపడ్డాను. కాలు, చేయి బెణికాయి. అది యాక్సిడెంట్‌ల్‌గా జరిగింది అని విశాల్ చెప్పారు. ఇలాంటి నొప్పులు, బాధలు హీరోల జీవితంలో సాధారణం అని అన్నారు.


Click it and Unblock the Notifications











