యాక్షన్ కింగ్ కుమార్తె హీరోయిన్ గా చిత్రం ప్రారంభం
ఈ చిత్రంలో ప్లస్‌టూ చదివే విద్యార్థినిగా ఐశ్వర్య పాత్ర ఉంటుంది. ఐశ్వర్య ప్రస్తుతం విజువల్ కమ్యూనికేషన్స్‌కి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్నారు. ఇక ఓ పెద్ద హిట్ కోసం వేచిచూస్తున్న విశాల్ ఇప్పుడు యాక్షన్ చిత్రాలపై దృష్టి పెట్టాడు. గతంలో ఆయన నటించిన 'పొగరు'; ' పందెం కోడి' వంటివి కాసులవర్షం కురిపించాయి. మళ్లీ ఇప్పటివరకు అంతటి విజయం లభించలేదు. నటనాపరంగా 'వాడూ... వీడు' తృప్తిపరిచినా.. విశాల్‌కంటూ ప్రత్యేక గుర్తింపు దక్కలేదన్నదు. ప్రస్తుతం తిరు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'వేటాడు..వెంటాడు' కూడా చివరిదశకు చేరుకుంది. త్రిష హీరోయిన్. ఇదిలా ఉండగా ఈ కొత్త చిత్రానికి విశాల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
విశాల్ మాట్లాడుతూ.... " 'పందెం కోడి'తో గుర్తింపు వచ్చింది. నటునిగా మునుపటి సినిమా 'వాడు వీడు' మంచి పేరు తెచ్చింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మంచి కథతో వేటాడు వెంటాడు సినిమా చేశా. అదో యాక్షన్ థ్రిల్లర్. కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా. నా పాత్రకు సమానంగా త్రిష పాత్ర ఉంటుంది. యువన్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. రెండు భాషల్లో ఒకేసారి సినిమా విడుదలవుతుంది. త్వరలో శశాంక్ వెన్నెలకంటి దర్శకత్వంలో తెలుగులో నేరుగా ఓ సినిమా చేయబోతున్నా..అలాగే భూపతి పాండ్యన్ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంలో నా అభిమానులకు నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications












