For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్‌ని వదిలేలా లేరుగా.. వరలక్ష్మి తర్వాత మరో అమ్మాయి!

    |

    హీరో విశాల్ తరచుగా వార్తల్లో నిలిస్తున్నాడు. వివాదాలు, వ్యక్తిగత అంశాలతో విశాల్ గురించి వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. విశాల్ ప్రేమలో ఉన్నాడు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. అలాంటి అసత్య ప్రచారాలని విశాల్ ఎన్నిసార్లు ఖండించిన ఫలితం లేకుండా పోయింది. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు, విశాల్ కు మధ్య ఎఫైర్ సాగుతోందంటూ తమిళ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హైదెరాబాదీ అమ్మాయితో విశాల్ ప్రేమలో ఉన్నాడంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.

    విశాల్ స్వయంగా చెప్పినట్లు

    విశాల్ స్వయంగా చెప్పినట్లు

    విశాల్ ఓ హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరిద్దరి వివాహం జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని విశాల్ దృవీకరించినట్లు కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కాదు అని, తాము ప్రేమించుకుని పెద్దలని ఒప్పించమని విశాల్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

    నా పెళ్లి గురించి మళ్లీ మాట్లాడితే.. ముడ్డి మీద తన్నుతా.. నన్నెవరూ అంటూ వరలక్ష్మీ ఫైర్

    ఖండించిన విశాల్

    తానే చెప్పినట్లు వస్తున్న అసత్య వార్తలని చూసి విశాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. దయచేసి ఇలాంటి వార్తలు సృష్టించకండి. మంచి పద్ధతి కాదు. ఇది నా వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయం. ఏదైనా ఉంటె నేనే సంతోషంగా ప్రకటిస్తాను అని విశాల్ తెలిపాడు. త్వరలోనే నా పెళ్లి గురించి అన్ని వివరాలు ప్రకటిస్తాను అని విశాల్ ట్వీట్ చేశాడు.

    పెళ్లి నిజమే

    పెళ్లి నిజమే

    విశాల్ మాటల బట్టి చూస్తే.. త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడనేది మాత్రం స్పష్టం అవుతోంది. కానీ ఆ వివరాలని ఇప్పుడే బయట పెట్టేందుకు విశాల్ ఇష్టపడడం లేదు. హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే వార్తలపై విశాల్ మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. విశాల్ ఎన్ని సార్లు తనపై వస్తున్న రూమర్స్ ని ఖండించినా.. సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది.

    త్వరలో టెంపర్ రీమేక్‌తో

    త్వరలో టెంపర్ రీమేక్‌తో

    సినిమాల విషయానికి వస్తే.. విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్ గా తెరకెక్కుతున్న అయోగ్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ గత ఏడాది అభిమన్యుడు, పందెం కోడి 2 చిత్రాల్లో నటించాడు. వరలక్ష్మి తనకు మంచి స్నేహితురాలని విశాల్ పలు సందర్భాల్లో స్ఫష్టం చేశాడు. కానీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి వరలక్ష్మితో మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న విశాల్ కు ఎదురవుతూనే ఉంది.

    English summary
    Vishal respaonds on latest rumour about his marriage with Hyderabad girl
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X