విశాల్, రీచాలకు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్
మిరపకాయ్ భామ 'రీచా గంగోపాధ్యాయ్' నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు సొంతం చేసుకుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'మయక్కమ్ ఎన్న' చిత్రంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌కు గాను ఆమెను ఈ అవార్డు వరించింది. అదే విధంగా హీరో విశాల్ అవన్ ఇవన్(తెలుగులో వాడు వీడు) చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. ఏప్రిల్ 26 నుంచి 29 వరకు నార్వే రాజధాని ఓస్లోలో ఈ ఫెస్టివల్ జరిగింది.
మయక్కమ్ ఎన్న, అవన్-ఇవన్ ఈ చిత్రాలు విడుదలై చాలా రోజులయింది. ఈ చిత్రాల్లో నటనకు గాను ఇద్దరికీ తరచూ ఏదో ఒక అవార్డు వస్తూనే ఉంది. మయక్కమ్ ఎన్న రీచా నటించిన తొలి తమిళ సినిమా. తొలి సినిమాతోనే తమను బాగా మెప్పించినందుకు కూడా ఓ అవార్డు ఇచ్చారు తమిళ తంబీలు. ఆ తర్వాత రీచా శింబుతో కలిసి 'ఓస్తి'(దబాంగ్ రీమేక్) అనే తమిళ చిత్రంలో ఈ భామ నటించింది.
రీచా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'వారధి' అనే చిత్రంలో నటిస్తోంది. తనకంటే సీనియర్ నటి అనుష్కతో కలిసి అందాల ఆరబోత విషయంలో పోటీ పడుతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా సగం పూర్తయింది.
వీటితో పాటు...'బిక్రమ్ సిన్హా-ది లయన్ ఈజ్ బ్యాక్' అనే బెంగాళీ చిత్రంలోనూ రిచా హీరోయిన్‌గా ఎంపికయింది. ప్రెసెన్జిత్ చటర్జీ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి రాజీవ్ బిస్వాస్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











