Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విజయ్ సినిమానీ పైరసీ చేస్తాం "తమిళ్ రాకర్స్" ప్రకటన: ఒక్క ఏడాది టైమ్ ఇచ్చిన విశాల్
పైరసీ వెబ్ సైట్ల భరతం పడతానంటూ ప్రకటన చేశాడు విశాల్. ఏడాదిలో తాను తమిళ పరిశ్రమలో పైరసీ జాఢ్యమే లేకుండా చేస్తానని అతను శపథం చేశాడు.
Recommended Video
తెలుగు, తమిళం, మలయాళం, హాలీవుడ్, బాలీవుడ్... ఏ సినిమా అయినా, రిలీజ్ అయిన రోజే పైరసీ చేయడంలో దిట్టయిన 'తమిళ్ రాకర్స్' వెబ్ సైట్ నిర్వాహకులను చెన్నై పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. గత మూడేళ్లుగా వందలాది సినిమాలను పైరసీ చేసి వెబ్ సైట్ లో పెట్టి చిత్ర నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించిన 'తమిళ్ రాకర్స్' అడ్మిన్ గౌరీ శంకర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు, కోలీవుడ్ ప్రముఖులూ ఆనందించేలోపే ఆ ఆనందం అంతా ఆవిరయ్యింది.
అభిమానులని కూడా రంగం లోకి
పైరసీ పై యుద్దం అంటూ అభిమానులని కూడా రంగం లోకి దింపి ఫ్లైయింగ్ స్క్వాడ్ లాగా అన్ని థియేటర్లలోనూ నిఘాపెట్టీ హల్ చల్ చేసాడు విశాల్. అయితే అంత పక్కా చర్యలు తీసుకున్నా పైరసీని మాత్రం ఆపలేకపోయారు. విడుదలైన కొన్ని గంటలలోనే తుప్పరివాలన్ చిత్రం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ విశాల్‌కు షాక్ ఇచ్చింది. దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది విశాల్ కి.
‘మెర్సల్'ను పైరసీ చేసి వెబ్ సైట్లో పెడతామంటూ
మరోవైపు విజయ్ సినిమా ‘మెర్సల్'ను పైరసీ చేసి వెబ్ సైట్లో పెడతామంటూ ‘తమిళ్ రాకర్స్' వెబ్ సైట్ ప్రకటన చేసి ఆశ్చర్యపరిచింది. ఐతే విశాల్ ఏమీ తక్కువ వాడు కాదు. పైరసీ వెబ్ సైట్ల భరతం పడతానంటూ అతనూ ప్రకటన చేశాడు. ఏడాదిలో తాను తమిళ పరిశ్రమలో పైరసీ జాఢ్యమే లేకుండా చేస్తానని అతను శపథం చేశాడు.
తేలిగ్గా వదిలిపెట్టనని ప్రకటించాడు
ఏడాది లోపు తమిళ సినిమాల్ని పైరసీ చేసి పెట్టే ప్రముఖ వెబ్ సైట్లన్నింటినీ మూత వేయించడమే ధ్యేయంగా తాను పనిచేస్తతున్నట్లు విశాల్ తెలిపాడు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధంగా ఉందని.. పైరసీ చేసే వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టనని అతను ప్రకటించాడు. ఈ విశయం లో హీరో విజయ్ కూడా విశాల్ డేడికేషన్ పట్ల తన అభిప్రాయాన్ని చెప్పాడు. విశాల్ చేస్తున్న యుద్దం చాలా గొప్పదంటూ కీర్తించాడు.
చాలా పెద్ద స్టేట్మెంటే
నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ సాగిపోతున్న విశాల్‌కు పైరసీని నిర్మూలించడం మాత్రం చాలా పెద్ద సవాలే. ఇంటర్నెట్ అంటేనే ఓ సముద్రం. రోజు రోజుకూ అది విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాదిలోపు పైరసీ వెబ్ సైట్లన్నీ మూత పడేలా చేస్తాననడం చాలా పెద్ద స్టేట్మెంటే. మరి ఈ మాటను అతనెలా నిలబెట్టుకుంటాడో చూడాలి.