Don't Miss!
- Technology X ప్లాట్‌ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విశాల్ పెళ్లి క్యాన్సిల్.. అసలు కారణాన్ని బయటపెట్టిన తండ్రి
కోలీవుడ్‌లో గతేడాది కుర్ర హీరోల ప్రేమ పెళ్లిళ్లు క్రేజీగా మారాయి. యువ తారలు ఆర్య, సాయేషా వివాహం ఘనంగా జరగుగా.. అదే దారిలో విశాల్, అనిశారెడ్డి పెళ్లి జరుగుతుందనుకొన్న అభిమానులకు గట్టి షాక్ తగిలింది. అయితే వారిద్దరి వివాహం నిశ్చితార్థం తర్వాత ఆగిపోవడంతో అనేక సందేహాలు మీడియాలో తలెత్తాయి. తాజాగా విశాల్, అనిషారెడ్డి పెళ్లి అంశం మరోసారి మీడియాలో వెలుగు చూసింది. ఇంతకు ఏం జరిగిందంటే...
ఆగస్టు 9వ తేదీన
వాస్తవానికి అంతా సవ్యంగా సాగితే విశాల్ పెళ్లి ఆగస్టు 9వ తేదీన జరుగాల్సింది. కానీ అనూహ్యంగా పెళ్లి క్యాన్సిల్ కావడం ఫ్యాన్స్‌కు దిగ్బ్రాంతికి గురిచేసింది. పెళ్లి క్యాన్సిల్ కాగానే విశాల్ ఫోటోను సోషల్ మీడియా అకౌంట్ నుంచి అనిషా రెడ్డి తొలగించడంతో కొంత క్లారిటీ వచ్చింది. అయితే పెళ్లి రద్దు వెనుక కారణాలు మాత్రం తెలియరాలేదు.
విశాల్ తండ్రి మీడియాతో
ఇక ఆ తర్వాత విశాల్, అనిశా కూడా తమ పెళ్లి అంశంపై పెదవి విప్పకపోవడంతో మరుగునపడిపోయింది. విశాల్ పెళ్లి గురించి అంతా ఆ విషయాన్ని మరిచిపోతుండగా విశాల్ తండ్రి జీకే రెడ్డి మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో మళ్లీ మ్యారేజ్ అంశానికి జీవం పోసినట్టయింది. విశాల్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి క్యాన్సిల్ కాలేదు. ఏ క్షణమైనా జరుగొచ్చు అంటూ పేర్కొన్నారు.
పెళ్లి రద్దు అసలు కారణం
విశాల్ పెళ్లిపై తండ్రి, పారిశ్రామిక వేత్త జీకే రెడ్డి మాట్లాడుతూ.. నిశ్చితార్థం జరిగిపోయింది. తమిళ నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తయితే గానీ పెళ్లి చేసుకోనని విశాల్ తీర్మానించుకొన్నారు. కాబట్టి ఆ పెళ్లి ఆలస్యం అయింది అంటూ అసలు కారణం చెప్పారు. నడిగర సంఘం భవన నిర్మాణ అంశం కోర్టులో ఉంది. కాబట్టి అప్పుడే తేలేటట్టు లేదు కాబట్టి పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అన్నారు.
ఆ కారణంగానే పెళ్లి వాయిదా
దక్షిణాదిలో స్టార్ హీరో విశాల్, అర్జున్ రెడ్డి చిత్రంతో పరిచయమైన అనిషా రెడ్డి ఆల్ల ప్రేమించుకొని పెళ్లి వరకు వచ్చారు. మార్చి 10వ తేదీన వారి నిశ్చితార్థం జరిగింది. అంతలోనే పెళ్లి రద్దు కావడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ క్రమంలో నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తయితేనే పెళ్లి చేసుకొంటానని మరోసారి విశాల్ స్పష్టం చేశారు. ఆగస్టులో భవన నిర్మాణం పూర్తియింది.