24 నుంచి విశాల్ గురించే ఇక

By Srikanya

చెన్నై : విశాల్ ...ప్రస్తుతం పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘కథకళి', ఎం.ముత్తయ్య దర్శకత్వంలో ‘మరుదు'లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘కథకళి' షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. పాటలు, ట్రైలర్‌ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో విశాల్‌ సరసన కేథరిన్‌, రెజీనా నటిస్తున్నారు. ‘ఇదు నమ్మ ఆళు' తర్వాత పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్ ఇప్పటికే విడుదలై ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చాయి. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పసంగా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

ఇటీవల నటీనటుల సంఘం ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న విశాల్ మంచి దూకుడు మీద ఉన్నాడు. వరస సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు. అంతేకాదు ఓ వైపు సినిమాలు, మరోవైపు సంఘం కార్యకలాపాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోని ‘ఎంజీఆర్‌'ను త్వరలో తెరపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో విశాల్‌ సరసన వరలక్ష్మి హీరోయిన్‌గా నటించారు.

విశాల్ సొంత చిత్ర నిర్మాణం నెలకొల్పి పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్, పూజై అంటూ వరుస చిత్రాలను నిర్మిస్తూ విజయాలను అందుకుంటున్నారు యువ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లే.

Vishal's Kathakali Movie Trailer and Audio from December 24th

ఇప్పటి వరకు పసంగ, మెరీనా, వంశం అంటూ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజ్ తొలిసారిగా విశాల్ వంటి మాస్ హీరోతో యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. మరి ఈ చిత్రంలో విశాల్‌ను ఎలా చూపించనున్నారో వేచి చూడాల్సిందే అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు పాండి రాజ్ మాట్లాడుతూ.., "మీ అందరి ఆశీస్సులతో...నా తదుపరి చిత్రం కథాకళి ప్లాన్ చేసాను. ఈ చిత్రం విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ మరియు పసంగ ప్రొడక్షన్స్ కలిపి నిర్మిస్తాయి. ఇది జాయింట్ వెంచర్" అన్నారు.

ఇక కథాకళి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో విశాల్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కొంబన్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ముత్తయ్య ఇప్పుడు విశాల్‌ను డెరైక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి మరుదు అనే పేరును ఖరారు చేశారు.

దర్శకుడు ముత్తయ్య ఇంతకు ముందు చేసిన కుట్టిపులి, కొంబన్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన లక్ష్మిమీనన్‌నే ఈ మరుదు చిత్రంలో హీరోయిన్ గా నటింపజేయాలని భావించినట్లు సమాచారం.

అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నటి శ్రీదివ్యను ఆ అవకాశం వరించింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ పడి ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్న విశాల్, రాధారవి ఈ చిత్రంలో హీరో, విలన్ గా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X