పందెం కోడి2కి ఎదురు దెబ్బ.. నిషేధం.. విశాల్‌పై భగ్గుమంటున్న..
మాస్ హీరో విశాల్, అందాల భామ కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన పందెం కోడి2 (తమిళంలో సందకోజి2) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే తమిళనాడులో ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ నెలకొని ఉంది. అయితే గత కొద్దికాలంగా పైరసీదారులకు, విశాల్‌కు జరుగుతున్న పోరాటం కారణంగా ఈ సినిమాను రెండు జిల్లాల్లో విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకోవడం సినీ, ప్రేక్షక వర్గాలను షాక్ గురి చేసింది. ఇంతకీ ఏమైందంటే..
Recommended Video


రెండు జిల్లాల్లో నిషేధం
త్రిచూర్, తంజావురు జిల్లాలో పందెం కోడి 2 సుమారు 40 థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే త్రిచూరు జిల్లాలోని పది థియేటర్లలో సినిమాలను పైరసీ చేస్తున్నట్టు తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి వచ్చింది. దాంతో ఈ రెండు జిల్లాలోని 40 థియేటర్లలో విడుదల చేయవద్దని నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకొన్నది.

పైరసీని దృష్టిలో పెట్టుకొని
ప్రపంచవ్యాప్తంగా పందెం కోడి2 సినిమా అక్టోబర్ 18న రీలీజ్ కానున్నది. పైరసీని దృష్టిలో పెట్టుకొని త్రిచూర్, తంజావురు జిల్లాలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయవద్దని నిర్మాతలు తీసుకొన్న నిర్ణయంపై రెండు జిల్లాల థియేటర్ అసోసియేషన్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

విశాల్‌పై భగ్గమంటున్న థియేటర్ల..
విశాల్ నిర్మాతల సంఘం అధ్యకుడిగా ఉన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకొంటారు అని త్రిచూరు, తంజావూర్ థియేటర్ అసోసియేషన్ భగగుమన్నది. వాళ్లు అనుమతించినా మేము విశాల్ సినిమాను ప్రదర్శించబోమని హెచ్చరించారు.

పైరసీపై విశాల్ పోరాటం
తమిళ చిత్ర పరిశ్రమకు ఆన్‌లైన్ పైరసీ పెద్ద ముప్పుగా మారింది. పైరసీని అడ్డుకోవడానికి విశాల్ పెద్ద ఎత్తున చర్యలు తీసుకొంటున్నారు. థియేటర్లలో పైరసీకి పాల్పడే వారిని పట్టిచ్చినా.. ఆచూకీ తెలిపినా లక్ష రూపాయల బహుమతిని ఇస్తామని విశాల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











