పూజ: విశాల్-శృతి హాసన్ హాట్ అండ్ సెక్సీ లుక్ (ఫోటోలు)
హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ ఈ మధ్య ఏ సినిమాలో చూసినా హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల విడుదలైన రేసు గుర్రం చిత్రం లోనూ, అంతకు ముందు విడుదలైన ఎవడు చిత్రంలో, ఆ మధ్య విడుదలైన ఓ హిందీ చిత్రంలో శృతి అందచందాలు వావ్ అనిపించే విధంగా ఉన్నాయి.
తాజాగా శృతి హాసన్ నటిస్తున్న తమిళ చిత్రం తెలుగులో 'పూజ' పేరుతో విడుదలవుతోంది. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన ఫోటోలు విడుదలయ్యాయి. తాజాగా తన సెక్సీ అందాల మ్యాజిక్ చూపెట్టింది శృతి. ఈచిత్రంలో ఆమె విశాల్‌కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'సింగం' ఫేం హరి దర్శకత్వం వహిస్తున్నారు.
తన సొంత బేనర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై హీరో విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్, శృతి హాసన్, సత్యరాజ్, రాధిక శరత్ కుమార్, ముఖేష్ తివారి, సూరి, తలైవాసై విజయ్, అభినయ, సితార తదితరులు ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రం కోసం విశాల్-శృతి హాసన్‌లపై జరిపిన ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది.

హిట్టు లేని విశాల్
గత కొంత కాలంగా హీరో విశాల్ సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. దీంతో అతనితో సినిమాలు తీయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

బీహార్ మంత్రి
ఇందులో బీహార్ సాంస్కృతిక శాఖ మంత్రి వినయ్ బీహారి తళుక్కుమని మెరవబోతుండటం తాజా కబురు. ఈ సినిమా క్లెమాక్సులో వినయ్ బీహారి ఒక జిల్లా కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఇది ముందుగా అనుకుని చేసింది కాదని, ఆయన నటించడం యాధృచ్ఛికంగా జరిగిందేనని ఆ చిత్ర యూనిట్ చెబుతోంది.

శృతి హాసన్ గ్లామర్
ఈ మధ్య శృతి హాసన్ గ్లామర్ పరంగా సౌత్‌లో తన సత్తా చాటుతోంది. పైగా కమల్ హాసన్ కూతురు కావడంతో తన సినిమాకు కలిసొస్తుందని విశాల్ భావిస్తున్నాడు.

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ
‘పూజై' చిత్రంలో విశాల్, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేలా హాట్ అండ్ సెక్సీ సీన్లు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు హరి.

బీహార్ బ్యాక్ డ్రాప్
ఈ సినిమా కథ ప్రకారం కొంతభాగం బీహార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, అందుకోసం ఆ రాష్ట్రంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట.


Click it and Unblock the Notifications











