నా టైటిల్ కొట్టేశాడు... విశాల్ మీద దర్శకుడి సంచలన ఆరోపణలు!
తమిళంలో స్టార్ హీరోగా ఉన్న విశాల్ తెలుగులో కూడా చాలా ఫేమస్. దాదాపు ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. స్వతహాగా తెలుగు వాడైన విశాల్ తమిళంలో హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆయన మీద ఒక దర్శకుసు సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

సంచలన ఆరోపణలు
నటుడు విశాల్‌పై సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ హీరో ప్రస్తుత తమిళనాడు ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తాను గత 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నానని అలా నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న "చక్రం" సినిమాకి పని చేసే సమయంలో తాను రాసుకున్న 'కామన్ మ్యాన్' అనే ఒక కథ చెప్పానని అన్నారు. అయితే కధ విని ఏమీ మాట్లాడని ఆయన ఇప్పుడు టైటిల్ వాడుకోవాలని చూస్తున్నారని అన్నారు.

అప్పుడు ఇస్తే తీసుకోకుండా
విశాల్ తాను నటిస్తున్న చిత్రానికి తన "కామన్‌మ్యాన్" టైటిల్‌ను అక్రమంగా వాడుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నాడు. ముందు అవసరమైతే కామన్ మ్యాన్ టైటిల్ వాడుకోమని ఆయనకు చెప్పానని, అయితే అప్పుడు ఆయన మౌనంగా ఉండి ఇప్పుడు తన అనుమతి లేకుండా టైటిల్ వాడుకుందామని చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

బెదిరిస్తున్నారు
అయితే ఇబ్బందులు రాకుండా తన టైటిల్ కింద "నాట్ ఏ కామన్ మ్యాన్" అనే ట్యాగ్‌లైన్ యాడ్ చేశాడని అన్నారు. ఈ విషయం గురించి తాను విశాల్ ను ప్రశ్నించగా ఆయన వర్గం తన మీద బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక ఈ అంశానికి సంబంధించి విశాల్ ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది. నిజానికి ఆయన నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

వాళ్ళ తప్పేమీ లేదు
ఇక ఈ సినిమా ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ఇందులో స్టెంట్ మాన్ తప్పేమీ లేదని విశాల్ పేర్కొన్నారు. కేవలం మిస్ టైమింగ్ వల్ల తన తలకు సీసా తగిలింది అని ఈ మధ్య పేర్కోన్నారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇలాంటి పొరపాట్లు జరగడం సహజం అని ఆయన పేర్కొన్నారు. అంతేకాక దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులు వల్ల తనకు ఏమీ కాలేదని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.

వార్తల్లో
వాస్తవానికి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో విశాల్ పేరు దాదాపు చాలాసార్లు వివాదాల్లో ఇరుక్కుంది.. నడిగర్ సంఘం అవకతవకలు మొదలు తాజాగా బాల శేషాద్రి భవన్ విషయంలో విశాల్ చేసిన వ్యాఖ్యల ద్వారా ఏదో ఒక విషయంగా ఆయన వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నాడు.


Click it and Unblock the Notifications











