గోపీచంద్, అనూష్క కాంబినేషన్ లో శివ రూపొందించిన శౌర్యం భాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని నమేదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రాన్ని విశాల్ తమిళంలో చేయబోతున్నాడని సమాచారం. సెల్యూట్ పరాజయం అనంతరం మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్న నేఫద్యంలో విశాల్ ఈ నిర్మాణం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విశాల్ చేస్తున్న పిస్తా అనంతరం ఈ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే శౌర్యం చూసిన విశాల్ వెంటనే గోపీచంద్ కి ఫోన్ చేసి అభినందించి ఈ విషయం చెప్పాటం జరిగిందని తెలుస్తోంది. తమ స్వంత బ్యానర్ పై సినిమా చేయాలని రీమేక్ రైట్స్ కోసం అడుగుతున్నాడు. కొద్ది పాటి మార్పులుతో త్వరలోనే శౌర్యాన్ని తమిళ తెరకు అందించటానికి విశాల్ దర్శకుడు అన్వేషణలో ఉన్నాడు.