అదేంటి శౌర్యం రిలీజై,హిట్టై వెళ్ళిపోయింది కదా..మళ్ళీ విశాల్ ఈ సినిమాలో కనపడటమేమిటని అనుకోవద్దు. గోపీచంద్, అనూష్క కాంబినేషన్ లో కెమెరామెన్ శివ రూపొందించిన శౌర్యం సినిమా విజయం తమిళ రీమేక్ కు ఊపిరి పోస్తోంది. అయితే అక్కడ హీరోగా నటించేది మరెవరో కాదు...విశాల్. ప్రస్తుతం Thoranai అనే చిత్రంలో శ్రియతో చేస్తున్న విశాల్ ఈ చిత్రం చూసి చాలా ముచ్చట పడ్డాడుట. దాంతో దాన్ని తమిళంలోకి డబ్బింగ్ చేయవద్దని తెలియచేసి రీమేక్ తో తాను నటిస్తానని మాటిచ్చాడు. ఇక అక్కడ కూడా అనూష్కే హీరోయిన్ గా చేస్తుందని సమాచారం. అలాగే దర్శకుడుగా కూడా శివే కొనసాగే అవకాశముందిట. లక్ష్మి ప్రొడక్షన్స్ వారు తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక శివ ప్రస్తుతం గోపీచంద్ తో మరో చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం తమళ శౌర్యాన్ని అక్కడ డైరక్ట్ చేస్తారు.