విశాల్-వరలక్ష్మి పోటాపోటీగా.... అర్దరాత్రి ఆమెకు స్వీటీ అంటూ మెసేజ్!

తెలుగులో మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న టీవీషో 'మేము సైతం' కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువురు సినీ స్టార్లు ఈ కార్యక్రమంలో భాగమై ఎంతో మంది పేదవారికి సహాయం అందించారు. ఈ షోలో భాగంగా సినీ స్టార్స్ కామన్‌మెన్‌ అవతారం ఎత్తి వస్తువులు అమ్మడం ద్వారా నిధుల సేకరించిన సంగతి తెలిసిందే.

ఇపుడు ఇదే కాన్సెప్టుతో తమిళంలో 'నామ్ ఒరువర్' షో మొదలైంది. ఈ షోను తమిళ స్టార్, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ హోస్ట్ చేస్తున్నారు. నిన్న(అక్టోబర్ 7) ఈ షో ప్రారంభం అయింది. మొదటి ఎపిసోడ్‌కు అతిథిగా హీరో కార్తి హాజరయ్యారు.

విశాల్‌ను విష్ చేసిన వరలక్ష్మి

విశాల్‌ను విష్ చేసిన వరలక్ష్మి

తన బెస్ట్ ఫ్రెండ్ విశాల్ హోస్ట్ చేస్తున్న టీవీ షో కావడంతో వర లక్ష్మి అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘నామ్ ఒరువర్' షో తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ విష్ చేసింది.

థాంక్యూ స్వీటీ అంటూ అర్దరాత్రి విశాల్ రిప్లై

వరలక్ష్మి ట్వీట్ మీద విశాల్ అర్దరాత్రి దాటిన తర్వాత స్పందించారు. ‘థాంక్యూ స్వీటీ... నీకు కూడా ఆల్ ది బెస్ట్. నువ్వు చేయబోతున్న టీవీ షో ప్రోమో చూశాను. చాలా నచ్చింది. మార్పు కోసం మనవంతు కర్తవ్యం నిర్వర్తిద్దాం' అంటూ రిప్లై ఇచ్చారు.

పోటా పోటీగా విశాల్-వరలక్ష్మి టీవీ షోలు

పోటా పోటీగా విశాల్-వరలక్ష్మి టీవీ షోలు

విశాల్ హోస్ట్‌గా ‘నామ్ ఒరువర్' పేరుతో టీవీ షో సన్ టీవీలో ప్రారంభం అవ్వగా.... జయ టీవీలో వరలక్ష్మి హోస్ట్‌గా ‘ఉన్నై అరింతల్' అనే టీవీ షో అక్టోబర్ 14 నుండి ప్రారంభం కాబోతోంది. విశాల్, వరలక్ష్మి టీవీ షోలు పోటా పోటీగా ప్రారంభం అవ్వడం చర్చనీయాంశం అయింది.

నన్ను తొక్కేసే ప్రయత్నం, ఏమీ పీకలేరంటూ వర లక్ష్మి ట్వీట్

నన్ను తొక్కేసే ప్రయత్నం, ఏమీ పీకలేరంటూ వర లక్ష్మి ట్వీట్

కాగా... అంతకు ముందు తన పెళ్లి జరుగబోతోందంటూ వచ్చిన వార్తలపై వరలక్ష్మి ఘాటుగా స్పందించారు. తన నిశ్చితార్థం జరుగలేదని, పెళ్లి వార్తలు అబద్దమని తేల్చి చెప్పేశారు. ఇండస్ట్రీలో నన్ను తొక్కేయడానికి ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెస్తున్నారు. మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ పీకలేరు, నా హార్డ్ వర్క్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు... అంటూ వరలక్ష్మి ట్వీట్ చేశారు.

విశాల్-వరలక్ష్మి మీద గతంలో పుకార్లు

విశాల్-వరలక్ష్మి మీద గతంలో పుకార్లు

విశాల్-వరలక్ష్మి ఎప్పటి నుండో బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ చూసి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తలు ఇద్దరూ ఖండించారు. ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్లో బిజీగా గడుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X