రూ. 45 లక్షలు నొక్కేసింది.. రమ్య అసలు గుట్టు విప్పిన విశాల్

విశాల్ నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, మాజీ ఉద్యోగి రమ్య మధ్య జరుగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల నుంచి తమ కంపెనీలో నుంచి డబ్బు మాయం అవుతోందని, దాదాపు 45 లక్షల వరకు కాజేసిందని రమ్యపై విశాల్ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. వారు ట్యాక్స్‌లు కట్టడం లేదని, వాటి నుంచి తప్పించుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని సదరు ఉద్యోగి రమ్య పేర్కోనడం విశేషం. తాజాగా విశాల్ నిర్మాణ సంస్థ తమకు, రమ్యకు ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

సంస్థలో అవకతవకలు..

సంస్థలో అవకతవకలు..

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అవకతవకలు జరిగాయని వచ్చిన వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసే రమ్య రూ.45 లక్షలు ఆమె తన సొంత ఖాతాల్లోకి బదిలీ చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదాయ శాఖకు చెల్లించాల్సిన టీడీయస్‌ను రమ్య ఆమె భర్త బ్యాంక్‌ అకౌంట్లు,తన బంధువుల బ్యాంకు అకౌంట్‌లోకి తరలించిందని పేర్కొన్నారు.

రహస్యాలు బయటపెడతా..

రహస్యాలు బయటపెడతా..

విశాల్ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నాడని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఉద్యోగిని రమ్య ఆరోపించింది. విశాల్ కార్యనిర్వాహకుడు హరి వర్గం తన ఇంటికి వచ్చి బెదిరించిందని పేర్కొంది. విశాల్‌కు సంబంధించిన చాలా విషయాలు తనకు తెలుసని అన్నింటిని బయట పెడతానని సంచలన కామెంట్స్ చేసింది.

ప్రెస్ నోట్..

ప్రెస్ నోట్..

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తాజాగా ఓప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ‘మా కంపెనీలో చాలా ఏళ్ల నుంచి చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. కొన్నేళ్ల నుంచి మా నిధులు దాదాపు రూ.45లక్షలు కాజేసిందని సాధారణ ప్రజలకు ఈ విషయం తెలియజేస్తున్నాం.ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

ఎటువంటి సంబంధం లేదు..

ఎటువంటి సంబంధం లేదు..

అయితే రమ్యతో ఎవరైనా కాంటాక్ట్ అయి ఉంది, ఏదైనా ఆర్థిక కార్యకలాపాలు జరిపి ఉంటే దానికి మీరే బాధ్యులు.ఆమెకు మాకు ఎలాంటి సంబంధం లేదు. రమ్యతో మీరు జరిపిన ఆర్థిక వ్యవహారాలపై మా బాధ్యత ఎంత మాత్రం లేద'ని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X