శ్రుతిహాసన్ ని ఎలాగైనా ఒప్పించాలని...
చెన్నై: కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా పేరుతెచ్చుకున్న శ్రుతి హాసన్... ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఆమె తో చెయ్యాలని ప్రతీ హీరో ఉవ్విళ్లూరుతున్నారు. ఆమె తమ సినిమాలో ఉంటే లక్ అని, చివరకు ఐటం సాంగ్ చేసినా ఫరవాలేదని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ హీరో ఆమె డేట్స్ కావాలని తిరగటంలో ఆశ్చర్యం ఏముంది. ఆ హీరో మరెవరో కాదు విశాల్.
'తామ్రభరణి' (తెలుగులో భరణి) చిత్రం తర్వాత హరి దర్శకత్వంలో విశాల్ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాడు. 'పూజై' టైటిల్‌తో చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన శ్రుతిహాసన్ మొదటిసారి నటిచింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని పాటల్లో సన్నివేశాలు స్విజ్జర్‌ల్యాండ్‌లో చిత్రీకరిస్తున్నారు.

విశాల్, శ్రుతిహాసన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న తర్వాతి చిత్రంలోనూ తన జంటగా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేయ్యాలని విశాల్ కోరాడట. అయితే కాల్షీట్లు లేకపోవడంతో అందుకు శ్రుతిహాసన్ అంగీకరించలేదట. అయితే ఎలాగైనా ఆమెను ఒప్పించాలని విశాల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











