విశాల్ తో మిస్ ఇండియాలు జోడి
సెల్యూట్, పిస్తా వంటి ప్లాప్ చిత్రాలతో రేసులో కాస్త వెనుకబడ్డ హీరో విశాల్ తమిళంలో మరో కొత్త సినిమాకు 'తీరడ మిళయాట్టు పిళ్లై' కి శ్రీకారం చుట్టాడు. ఇందులో ఇద్దరు మిస్ ఇండియాలు తనుశ్రీ దత్త్స్, నీతూ చంద్రలు నటిస్తుండటంతో అంతా ఈ సినిమా గురించి హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం ద్వారా విశాల్ 'తిరు' అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఇందులో నీతూ చంద్ర, తనూశ్రీదత్తా అందాలు అందరినీ ఆకట్టుకుంటాయని ఆ సినిమా వర్గాల ద్వారా తెలిసింది. ఇంత వరకు పందెం కోడి, పొగరు చిత్రాల ద్వారా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విశాల్ ఈసారి రోమాంటిక్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి విశాల్ ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.
vishal salute pista thanu shri data neetu chandra విశాల్ సెల్యూట్ పిస్తా తమిళ సినిమా తీరడ మిళయాట్టు పిళ్లై తనుశ్రీ దత్త్స్స్ నీతూ చంద్ర


Click it and Unblock the Notifications