twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జ్వాలా గుత్తా రెండో పెళ్లికి లైన్ క్లియర్.. అధికారికంగా తమిళ హీరో ప్రకటన.. పెళ్లి ఎప్పుడంటే?

    |

    బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మరోసారి పెళ్లికూతురు కాబోతున్నారు. గత కొద్దికాలంగా తమిళ నటుడు విష్ణు విశాల్‌తో అఫైర్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ పెళ్లి గురించి సోమవారం (మార్చి 22వ తేదీన) నటుడు విష్ణు విశాల్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. విష్ణు విశాల్‌తో జ్వాలా గుత్తా లవ్ అఫైర్, పెళ్లి గురించిన విషయాలు మీ కోసం...

     నటుడిగా మారిన క్రికెటర్

    నటుడిగా మారిన క్రికెటర్

    తమిళ నటుడు విష్ణు విశాల్ కెరీర్ విషయానికి వస్తే ఆయన ఓ క్రికెటర్. ప్రమాదం జరగడంతో క్రికెట్‌కు దూరమయ్యారు. అయితే నటుడిగా కొనసాగుతూ తన చిన్ననాటి స్నేహితురాలు రజినిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వారిద్దరికి ఆర్య అనే కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరు 2018లో లీగల్‌గా విడాకులు తీసుకొన్నారు.

     జ్వాలా గుత్తాతో డేటింగ్

    జ్వాలా గుత్తాతో డేటింగ్

    ఆ తర్వాత జ్వాలా గుత్తాతో విష్ణు విశాల్ డేటింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే జ్వాలా గుత్తా మొదటి వివాహం విఫలం కావడంతో కొద్దికాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. కామన్ ఫ్రెండ్స్‌తో పరిచయం పెంచుకొన్న విష్ణు, జ్వాలా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో మునిగి తేలారు.

    విష్ణు విశాల్ రొమాంటిక్ లైఫ్

    విష్ణు విశాల్ రొమాంటిక్ లైఫ్

    గత రెండేళ్లుగా విష్ణు విశాల్, జ్వాల గుత్తా డేటింగ్ వ్యవహారం కేవలం దక్షిణాది మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వారిద్దరి రొమాంటిక్ లైఫ్, సన్నిహితంగా ఉండే ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే వారిద్దరూ ఎప్పుడూ తమ రిలేషన్‌షిప్ గురించి ఎన్నడూ అధికారికంగా ప్రకటించలేదు.

    త్వరలోనే జ్వాలాతో పెళ్లి

    త్వరలోనే జ్వాలాతో పెళ్లి

    అయితే తాజాగా సోమవారం విష్ణు విశాల్ చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ రిలేషన్‌షిప్ గురించి అధికారికంగా బహిర్గతం చేశారు. త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకొంటున్నాం. త్వరలోనే నేను తెలుగు కుటుంబానికి అల్లుడు కాబోతున్నాను. నా పెళ్లి వార్తను మీతో షేర్ చేసుకొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే పెళ్లి డేట్స్‌ను తెలియజేస్తాం అని విష్ణు విశాల్ తెలిపారు.

     రానా దగ్గుబాటితో విష్ణు విశాల్

    రానా దగ్గుబాటితో విష్ణు విశాల్

    నా కెరీర్‌లో అరణ్య సినిమా చాలా కీలకం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న అరణ్య సినిమా షూటింగు సమయంలో జ్వాలా అందించిన సహకారం మరువలేనిది. ఆ సినిమా జరిగినంత కాలం నాకు పెద్ద సపోర్టుగా నిలిచారు అని విష్ణు విశాల్ పేర్కొన్నారు. రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంలో మావటిగా నటిస్తున్నారు.

    English summary
    Tamil Actor Vishnu Vishal and Jwala Gutta going to tie the knot soon. He officilally annonced his marriage with jwala at Chennai press meet. Vishal Said, We are going to tie the know real soon and I am going to become a Telugu son-in-law now
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X