నా కాపురంలో చిచ్చుకు కారణం.. జ్వాలా, అమలాపాల్‌తో రిలేషన్‌షిప్ గురించి విష్ణువిశాల్!

తమిళ సినీ రంగంలో అనూహ్యంగా దూసుకొచ్చిన యువ హీరోల్లో విష్ణు విశాల్ ఒకరు. అయితే హిట్టు సినిమాలు తన ఖాతాలో వేసుకొన్నట్టే.. లెక్కలేనన్ని వివాదాలను, రూమర్లను, గాసిప్స్‌ను జమ చేసుకొంటున్నాడు. వరుస విజయాలు సొంతం చేసుకొంటున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. అయితే తన భార్యతో విడాకులు తీసుకోవడం వెనుక అమలాపాల్, జ్వాలా గుత్తా అని వచ్చిన రూమర్లపై విష్ణు విశాల్ స్పందిస్తూ..

దాంపత్య జీవితంలో చిచ్చు

దాంపత్య జీవితంలో చిచ్చు

తమిళ హీరో విష్ణు విశాల్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. తన స్కూల్‌లో సహ విద్యార్థిని రజిని నటరాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. 11 దాంపత్య జీవితంలో ఓ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో 2017లో రజనీ, ఆయన విడాకులు తీసుకొన్నారు. విడాకుల తర్వాత కూడా వారిద్దరూ స్నేహితులుగానే ఉండాలని నిర్ణయించుకొన్నారు.

మా విడాకులకు కారణం

మా విడాకులకు కారణం

అయితే అన్యోన్యమైన దాంపత్య జీవితంలో చిచ్చుకు అసలు కారణం అమలాపాల్ అని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. రాక్షసుడు సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి తెరచాటు ప్రేమాయణమే విష్ణువిశాల్ జీవితంలో చిచ్చుపెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ అలాంటి వార్తలు నిజం కాదు అని విష్ణు విశాల్ చెప్పారు.

 జ్వాలా గుత్తాతో రిలేషన్

జ్వాలా గుత్తాతో రిలేషన్

ఇక అమలాపాల్ తర్వాత జ్వాలా గుత్తాతో విష్ణు విశాల్ పరిచయం మరింత వివాదాన్ని రేకేత్తించింది. వీరిద్దరి అఫైర్ కారణంగా మళ్లీ రజనీ దాంపత్యంలో కలతలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఆ తర్వాత రజనీ, విష్ణు విశాల్ విడిపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

అమలాపాల్‌తో తప్పుగా

అమలాపాల్‌తో తప్పుగా

అయితే రజనీతో విడాకులు తీసుకోవడానికి కారణం అమలాపాల్ గానీ, జ్వాలా గుత్తా కాదు. ఆమె (తమిళంలో ఆడై) సినిమా సమయంలో అమలాపాల్‌తో నా రిలేషన్‌ను తప్పుగా చిత్రీకరించారు. ఆమె వల్లనే నేను రజనీ నుంచి విడాకులు తీసుకొన్నాననే జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు.వాస్తవాలను తెలుసుకోకుండా ఏవోవో ఊహించుకోవడం మంచిది కాదు అని విష్ణు విశాల్ పేర్కొన్నారు.

Recommended Video

Jwala Gutta Dates Tamil Actor, Gets Intimate
వ్యక్తిగత కారణాల వల్లనే

వ్యక్తిగత కారణాల వల్లనే

జ్వాలా గుత్తాతో నా రిలేషన్‌పై కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె గానీ, నేను గానీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే చాలా దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. రజనీతో విడాకులు తీసుకోవడానికి జ్వాలా గుత్తా కూడా కారణం కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. రాక్షసుడు సినిమా సమయంలో అమలాపాల్‌తో రిలేషన్ మా విడాకులకు కారణం కాదు. మా మధ్య చోటుచేసుకొన్న విషయాలు పూర్తిగా మా వ్యక్తిగతం అని విష్ణు విశాల్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X