'పంజా' కోసం తిరుమలలో దర్శకుడు పూజ

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా ఈ నెల తొమ్మిదవ తేదీన విడుదల అవ్వుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం దర్శకుడు విష్ణు వర్దన్ తిరుమల వెళ్లి ప్రత్యేక పూజలు చేసి వచ్చారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పంజాలో పవన్ ని కొత్త స్టైల్ లో చూపెట్టి ఆయన పరవ్ ఏమిటో మరో గుర్తు చేసే ప్రయత్నం చేసాం. ఫ్యాన్స్,మూవీ లవర్స్ పవన్ ని మాస్ గ్లామరస్ రోల్ లో చూడటానికి ఇష్టపడతారు. మేము పంజాలో అలాగే చూపించాం. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అని ఆయన అన్నారు. ఇక ఈ చిత్రం ప్రీమియర్ షో ఎనిమిదవ తేదీ రాత్రి జరుగుతుంది. ప్రత్యేకంగా ఆహ్వానించిన ఫిల్మ్ పర్శనాలిటీలు ఈ షోకి హాజరవుతారు. అలాగే పవన్ కల్యాణ్ సినిమా అయితే, తెర వెనుక విష్ణువర్ధన్ సినిమా అని నిర్మాతలు చెప్తున్నారు.

శ్యామ్ కౌశల్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. సుమోలు, బాంబులు పేలడాలు వంటివి ఇందులో ఉండవు. మితిమించిన హీరోయిజం కనిపించదు. అయినా అవి బాగా ఆకట్టుకుంటాయి. దేశంలోని బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన పి.ఎస్. వినోద్ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకి ఎస్సెట్. సినిమా అంతా విజువల్ ఫీస్ట్‌గా కనిపిస్తుందంటే కారణం ఆయనే. అలాగే చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పంజాలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల వాణిజ్య అంశాల్ని సమపాళ్లలో మేళవించిన సినిమా. ఇలాంటి సబ్జెక్టును విష్ణువర్ధన్ అయితే బాగా డీల్ చేస్తారని పవన్ కల్యాణ్‌కు డైరెక్టర్ ఎస్.జె. సూర్య చెప్పడంతో ఆయన ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. విష్ణు 'పంజా' కథని నడిపిన విధానం కానీ, ఆయన టేకింగ్ కానీ అత్యున్నత ప్రమాణాల్లో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆయనకు తెలుగులో బ్రహ్మాండమైన డిమాండ్ ఏర్పడుతుంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X