మహేష్ బాబు, నేనూ క్లాస్‌మేట్స్ అందుకే
తెలుగులో ఎవరితో సినిమాలు తీయాలని ఉంది? అని పంజా దర్శకుడు విష్ణువర్దన్ ని అడిగితే ఆయన వెంటనే తడుముకోకుండా.. మహేష్ బాబు, నేనూ క్లాస్‌మేట్స్. ఒకే స్కూల్లో చదువుకొన్నాం. తన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్‌ని రెండు మూడుసార్లు కలుసుకొన్నా. అంతులేని హుషారు ఆయన సొంతం. వీరిద్దరితో సినిమాలు చేయాలని ఉంది అన్నారు. ఆయన తాజా చిత్రం పంజా ఈ నెల తొమ్మిదవ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. గతంలో ఒకటి రెండు సార్లు మహేష్ తో ప్రాజెక్టులు చేయాలని విష్ణువర్ధన్ అనుకున్నా మెటీరియలైజ్ కాలేదు. పంజా హిట్టైతే మహేష్ ని కలిసి కథ చెప్పి ఒప్పించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు విష్ణువర్ధన్. ఇప్పుడాయన దృష్టి అంతా తెలుగు హీరోలపైన ఉంది.
ఎన్టీఆర్ కి కూడా కథలు చెప్పిన ఆయన అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతా పంజా విజయంపైనే ఆధారపడి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ కి కథ చెప్పినా డేట్స్ ఇచ్చే స్ధితిలో లేడు. మహేష్ కంటిన్యూగా ప్రాజెక్టులు ఒప్పుకుని ఉన్నారు. ప్రస్తుతం పూరితో చేస్తున్న బిజినెస్ మ్యాన్ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు షూటింగ్ లో పాల్గొంటారు. అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వం లో రూపొందే ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత క్రిష దర్శకత్వంలో అశ్వనీదత్ చిత్రం ఉంది. వెనువెంటనే మరో రెండు చిత్రాలు పట్టాలు ఎక్కనున్నాయి. మహేష్ సైతం గతంలో లాగ కాకుండా వరసగా చిత్రాలు ఒప్పుకుని ఏడాదికి మినిమం రెండు చిత్రాలు రిలీజ్ అయ్యేలాగ ప్లాన్ చేస్తున్నారు. మరి విష్ణువర్ధన్ కి ఎప్పుడు అవకాసం వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











