టైటిలేమో సీక్వెల్...కథ మో ప్రీక్వెల్

By Srikanya

చెన్నై : కమల్‌ ఇటీవల స్వీయ దర్శకనిర్మాణంలో నటించిన 'విశ్వరూపం' ఆశించిన స్థాయికంటే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కొన్ని సమస్యలు ఎదురైనా.. అన్నింటినికీ ధైర్యంగా నిలదొక్కుకున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించినప్పుడే.. రెండోభాగానికి సంబంధించి సగం సినిమాను చిత్రీకరించారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే పూర్తి చేశారు. 15న విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. ఇప్పుడు ఆ నిర్ణయం వాయిదా పడింది.

ఇందులో కమల్‌తోపాటు ఆండ్రియా, పూజా కుమార్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. సినిమా పేరుకు సీక్వెలే అయినా.. కథ ప్రకారం ప్రీక్వెల్‌గా ఉంటుందట. ఈ సినిమా ఎప్పుడైనా విడుదల కావొచ్చని కొన్ని రోజుల క్రితం కమల్‌ ప్రకటించారు. బహుశా వచ్చేనెల తొలి వారంలో తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

'Vishwaroopam 2' is both sequel, prequel, says Kamal Haasan

చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తన హవా చాటుకుంటున్న నటుడు కమల్‌హాసన్‌. వైవిధ్య పాత్రలకు ప్రాధాన్యమిచ్చే ఆయన.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తున్నారు. కోలీవుడ్‌లో తన తోటివారెవరికీ సాధ్యంకాని ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. మొన్న 'దశావతారం'తో యావత్‌ చిత్ర పరిశ్రమను ఆకట్టుకున్న కమల్‌.. నిన్న తన నట 'విశ్వరూపం'తో ఆకర్షించారు. తాజాగా 'రెండో'వైపు విశ్వరూపాన్ని చూపించేందుకు సంసిద్ధమవుతున్నారు. 'ఉత్తమ విలన్‌'గానూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. 'దృశ్య'విందును కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి మరింత సమయం పడుతోంది. అందుకే లేటు అని చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్న. తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం. సినిమాలోని పాటల్ని కమల్‌హాసన్‌ జన్మదినం సందర్భంగా నవంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X