‘విశ్వరూపం 2’ మేకింగ్ వీడియో: కమల్ హాసన్ ఈ వయసులోనూ...
కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వరూపం-2' ఆగస్టు 10న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీలో విడుదలవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలుగు వెర్షన్ ఆడియో వేడుకలో చిత్ర బృందం సందడి చేసింది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'విశ్వరూపం 2' మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వయసులోనూ కమల్ హాసన్ చేసే ఫీట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అతడు చేసే యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని స్పష్టమవుతోంది.
2013లో వచ్చిన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రూపొందుతోంది. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు.

మరో వైపు ఈ సినిమాను అడ్డుకుంటూ కోర్టులో పిటీషన్ దాఖలైంది. పిరమిడ్ సైమీరా ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సివిల్ సూట్ దాఖలు చేసింది. మర్మయోగి ప్రాజెక్టు కోసం కమల్ హాసన్‌కు ఈ సంస్థ రూ. 4 కోట్లు చెల్లిందని, అయితే ఈ సినిమా ఎలాంటి పురోగతి సాధించలేదని, ఈ ప్రాజెక్టుపై ఆయన ఆసక్తి చూపడం కానీ, తిరిగి డబ్బులు ఇవ్వడం కానీ చేయలేదని, తమ డబ్బు చెల్లించే వరకు ఈ సినిమా విడుదల ఆపాలని వారు తమ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ వివాదాన్ని సెటిల్ సేందుకు కమల్ హాసన్ ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











