twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం-2' కి అప్పుడే వార్నింగ్

    By Srikanya
    |

    చెన్నై :కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'విశ్వరూపం-2' ని తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు కమల్‌. ఈ చిత్రం కొనసాగింపు భాగం త్వరలోనే తెరపైకి రానుంది. కమల్‌ ఈ పనుల్లో తలమునకలై ఉన్నారు. అయితే ఈ చిత్రానికి తలనొప్పులూ తప్పవని తెలుస్తోంది. ఇప్పటికే ఓ జీహీదీ సంస్ధ.. విశ్వరూపం అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. మొదటిభాగం ఒక్క తమిళనాడు మినహా మిగతా ప్రపంచమంతా సులువుగానే రిలీజైపోయింది. ఈసారి రెండో భాగం ఎక్కడా రిలీజ్‌ కాకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్‌ సోదరులు ఉద్యమం లేవనెత్తనున్నారని వార్తలు వస్తున్నాయి.

    'ముస్లిం మున్నె్ట్ర కళగమ్‌' అనే సంస్థ ముస్లిమ్‌లను టెర్రరిస్టులుగా చూపిస్తు న్నారంటూ..ఈసారి విశ్వరూపం 2ని అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన తన ప్రాజెక్టు ఏమైపోతుందోనని కమల్‌ ఆందోళన చెందుతున్నాడు. ముప్పేటలా సమస్యలు చుట్టుముట్టడంతో కమల్‌కి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తన డ్రీమ్‌ప్రాజెక్ట్‌ 'విశ్వరూపం'ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు కమల్‌. ఈ రెండు భాగాల్లో తనే హీరోగా నటిస్తూ, దర్శకత్వం, నిర్మాణబాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఆ సినిమా రిలీజ్‌ టైమ్‌లో తమిళ ప్రభుత్వం ఆంక్షలు విధించి నానా హింసకు గురిచేసింది. దాంతో కమల్‌ చాలావరకూ నష్టపోవాల్సొచ్చింది. ఎన్నో సమస్యలను ఎదుర్కొని చివరికి రిలీజ్‌ చేసి సక్సెసయ్యాడు. ఇప్పుడు రెండో పార్ట్‌కి కూడా అవే సమస్యలు ఎదురవుతూండటంతో ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు.

    అయితే రెండో భాగంలో ఎలాంటి సమస్యాత్మక విషయాలు ఉండవని చెబుతోంది హీరోయిన్ పూజాకుమార్‌. పూజా కుమార్ మాట్లాడుతూ... తొలిభాగంలో ఎలాంటి అవాంఛనీయ సన్నివేశాలు లేవు. కొన్నివర్గాల వల్ల సమస్యాత్మకంగా మారింది. 'విశ్వరూపం-2'కు అలాంటి పరిస్థితి ఎదురవదని నమ్ముతున్నా. మనం స్వతంత్ర దేశంలో జీవిస్తున్నాం. మంచి అభిప్రాయాలను చెప్పే హక్కు మనకుంటుంది. అదే హక్కుతోనే కమల్‌ 'విశ్వరూపం' తెరకెక్కించారు. ఒకవేళ అసత్యమో, తప్పుడు అభిప్రాయాన్నో తెరకెక్కిస్తే దాన్ని తొలగించేందుకు సెన్సార్‌ బోర్డు ఉంది. ఇక్కడ చాలామంది సెన్సార్‌ అంగీకారం పొందాక కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆవేదన కలిగిస్తోంది. ప్రజలు మాత్రం మాతోనే ఉన్నారనే విషయం అర్థమవుతోంది. రెండోభాగం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది.

    విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

    English summary
    After all the controversy Kamal Haasan's Vishwaroopam turned out be a huge hit and the star actor is busy completing the second part titled 'Vishwaroopam 2' which is set to hit the screen soon. The latest we hear is that Vishwaroopam 2 is under the scanner as the film is getting to release later this year. Jawahar Ali, the leader of the Tamilnadu Muslim League is already sceptical about the sequel. Jawahar Ali said "We are disappointed to learn that Vishwaroopam 2 has scenes that portray Muslims as terrorists and also has scenes that hurt the religious sentiments of Muslims. Kamal Haasan portraying Muslims in bad light in his movies, and later trying to promote his product claiming that it is freedom of expression, is not a good thing to do as an artist."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X