కమల్ 'విశ్వరూపం' ఆడియో విడుదల తేదీ ఖరారు

By Srikanya

చెన్నై : విడుదల ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తున్న చిత్రం కమల్ 'విశ్వరూపం'. ఆడియో విడుదలలోనూ అదే పంథాలో సాగుతోందీ సినిమా.ఆడియోను కూడా కమల్‌ పుట్టినరోజు కానుకగా నవంబరు 7న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. అదీ డిసెంబరు 2కు వాయిదా పడింది. తాజాగా ఈనెల 7న విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. చెన్నైలో జరగనున్న ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు సినీ రంగ ప్రముఖులు పలువురు పాల్గొననున్నారు. తెలుగు ఆడియో కూడా అదే స్టేజిపై ఆవిష్కరిస్తారా లేక హైదరాబాద్ లో ఆవిష్కరిస్తారా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

ఆడియో విడుదల వివరాలు

తేదీ: డిసెంబర్ 7,2012
వెన్యూ 1: మధురై (వెల్ మల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ)
వెన్యూ 2: కోయంబత్తూర్ (హిందూ స్ధాన్ కాలేజ్)
వెన్యూ 3: చెన్నై (ఇంకా స్ధలం ఖరారు కాలేదు)

డిసెంబర్ 7 సాయింత్రం ఈ ఈవింట్ కి విశ్వరూపం చిత్రం యూనిట్ మొత్రం హాజరవుతుంది. మెగా ఈవింట్ మాత్రం చెన్నైలో జరుగుతుంది.

'విశ్వరూపం' ఆడియో ఆవిష్కరణ వేడుకను కొత్తగా ప్లాన్ చేశారు కమల్. ఒకేరోజు మూడు నగరాల్లో ఈ ఆడియో వేడుక జరగనుంది. చెన్నయ్, కోయంబత్తూర్, మధురైలలో పాటలను విడుదల చేయనున్నారు. ఈ మూడు చోట్ల జరిగే కార్యక్రమాల్లో కమల్‌హాసన్‌ పాల్గొని సీడీలను విడుదల చేస్తారు. ఒకే రోజు మూడు నగరాల్లో కాబట్టి, ఓ చార్టర్డ్ ప్లేన్‌ని అద్దెకు తీసుకున్నారని సమాచారం. ముందుగా మధురై, ఆ తర్వాత కోయంబత్తూర్, చివరిగా చెన్నయ్‌లో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు.

విశ్వనటుడు కమల్‌హసన్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో 'విశ్వరూపం' చిత్రం తెరకెక్కింది. తన చిత్రాల్లో ఎన్నో కొత్త విషయాలను స్పృశించే కమల్‌.. ఇందులో తీవ్రవాద ఇతివృత్తాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. తీవ్రవాదులను ఏరిపారేసి ఆపరేషన్‌ టీంకు అధిపతిగా, నృత్య దర్శకుడిగా ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా గత ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. అత్యున్నత సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వటంతో డిసెంబరుకు వాయిదా వేశారు. జనవరి 11వ తేదీని ఇటీవల ఖరారు చేశారు.

'విశ్వరూపం' తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X