రిలీజైన తమిళ 'విశ్వరూపం' ...పరిస్ధితేంటి

By Srikanya

చెన్నై: కమల్‌ హాసన్‌ సర్వం తానై నిర్మించిన 'విశ్వరూపం' తమిళ చిత్రం ఎట్టకేలకు తమిళనాడులో ఈరోజు( గురువారం) విడుదలైంది. రాష్ట్రంలో 'విశ్వరూపం' చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద కమల్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ధియోటర్స్ మొత్తం హౌస్ ఫుల్ అయ్యీయి. ధియోటర్స్ వద్ద కమల్ ప్యాన్స్ మిఠాయిలు పంచిపెట్టారు. చాలా చోట్ల కమల్ కటౌట్స్ కు పాలాభిషేకం చేసారు. ఇక ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలా ఉందని చూసిన వారు వ్యాఖ్యానించటంతో థియోటర్స్ వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా ప్రముఖ హీరో రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా బుధవారం 'విశ్వరూపం' ప్రత్యేక ప్రదర్శన వీక్షించారు. ఇక చిత్రానికి మార్నింగ్ షోకి మంచి టాక్ వచ్చింది. కమల్ అభిమానలు ఈ చిత్రాన్ని ఓ అద్బుతంగా వర్ణిస్తున్నారు. సోమవారం వరకు అన్ని షోలూ బుక్కై పోయాయని ధియోటర్ ఓనర్స్ అంటున్నారు. మరి సాధారణ ప్రేక్షకుల టాక్ ఎలా ఉంటుందనేది చూడాలి.

ఇక ఒక వర్గాన్ని కించపరిచే దృశ్యాలు ఉన్నాయనే ఆరోపణల మధ్య చిత్రం విడుదల నిలిచిపోయింది. చిత్ర ప్రదర్శనతో శాంతి, భద్రతలకు భంగం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి జె.జయలలిత నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం 'విశ్వరూపం'పై నిషేధం విధించింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెరపగా, కమల్‌ హాసన్‌, చిత్ర ప్రదర్శనకు అభ్యంతరం తెలిపిన వర్గాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. చిత్రంలో ఏడు దృశ్యాలు, కొన్ని సంభాషణల తొలగింపునకు కమల్‌ అంగీకరించటంతో చిత్ర ప్రదర్శనకు మార్గం సుగమమైంది.

తమిళనాడు ప్రభుత్వం 'విశ్వరూపం'పై ఆదివారం నిషేధాన్ని ఎత్తివేయటంతో కమల్‌ హాసన్‌ తాను మద్రాస్‌ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఉపసంహరించుకున్నారు. జస్టిస్‌ ఎస్‌.రాజేశ్వరన్‌ కమల్‌ పిటిషన్‌ను విచారిస్తున్నారు. ప్రభుత్వం, కమల్‌ కూడా తమతమ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు ఆయన అనుమతించారు. అంతేగాక రాజీపడేందుకు సిద్ధమని ఇరు పక్షాలు (కమల్‌ వెర్సస్‌ ముస్లిం గ్రూపులు) కూడా సన్నద్ధత వ్యక్తం చేశాయి. దాంతో వారం రోజులుగా నలుగుతున్న వివాదానికి తెరపడింది. తమిళనాడులోని జిల్లా కలెక్టర్లు తాము విధించిన నిషేధపుటుత్తర్వులను ఎత్తివేశారు.

దాంతో రూ.100 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం తమిళనాడులో విడుదలకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 7న చిత్రం ఈ రాష్ట్రంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. తమ సాంకేతిక బృందంతో చర్చించిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తానని కమల్‌ చెప్పారు. మార్పుల గురించి సెన్సార్‌ బోర్డుకు కూడా సమాచారం అందిస్తానన్నారు. 3 భాషలలో ఈ చిత్రం నిర్మితమైంది. జనవరి 11నే విడుదల కావలసి ఉన్నప్పటికీ ముస్లిం గ్రూపులు వ్యతిరేకత వ్యక్తం చేయటంతో సాధ్యపడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X