'విశ్వరూపం' కు తొలగిన అడ్డంకి...సీన్స్ తొలిగింపు

By Srikanya

చెన్నై: కమల్‌హాసన్‌ నిర్మించిన 'విశ్వరూపం' చిత్రం విడుదలకు తమిళనాడులో అడ్డంకులు తొలగిపోయాయి. ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమల్‌హాసన్‌ బృందం, ముస్లిం సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో తమిళనాడులో విశ్వరూపం విడుదల కానుంది. సినిమాలోని 7 సన్నివేశాలు, 8 సంభాషణలు తొలగించేందుకు చిత్రనిర్మాణ బృందం అంగీకరించింది. ముస్లిం సంఘాలు, కమల్‌హాసన్‌ మధ్య దాదాపు 5గంటల పాటు చర్చలు జరిగాయి.

కమల్ మాట్లాడుతూ - కొన్ని సన్నివేశాలను తొలగించి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు, ఒకట్రెండు రోజుల్లో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ చర్చలు సుమారు అయిదు గంటలపాటు సాగాయి. అభ్యంతరం వ్యక్తం చేసిన ఏడు సన్నివేశాల్నీ, కొన్ని సంభాషణల్నీ తొలగించేందుకు కమల్‌ అంగీకరించినట్లు తెలిసింది. తమిళ చిత్ర వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు 'విశ్వరూపం' తమిళనాడులో సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంతకు ముందుగా విమానాశ్రయంలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ఉత్తరాదిన తమ విశ్వరూపం చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరకంగా వేసిన దావాను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. చిత్ర ప్రదర్శన నిలిపివేత దావాను ముస్లిం సంఘాలు కూడా వెనక్కి తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్చలు సామరస్య పూర్వకంగా జరిగేందుకు సహకరించిన ప్రభుత్వానికి కమల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

తమిళనాట 'విశ్వరూపం' చిత్రం విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కమల హాసన్, ముస్లిం మతపెద్దల మధ్య శనివారం సానుకూల వాతావరణంలో చర్చలు సాగారుయి. వివాదం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వరూపం విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని కమలహాసన్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు, ముస్లిం సంఘాలతో చర్చల తరవాత కమల్‌హాసన్‌ చెన్నైలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చాయి.

విశ్వరూపం చిత్రాన్ని ఉత్తరాదిలో విడుదల చేసేందుకు ముంబయికి వెళ్లిన కమల్‌ శనివారం మధ్యాహ్నం చెన్నైకు చేరుకున్నారు. నేరుగా రాష్ట్ర సచివాలయానికి వెళ్లిన ఆయన - రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజగోపాల్‌, ముస్లిమ్‌ సంఘాలతో సమావేశమయ్యారు. రాత్రి వరకు జరిగిన చర్చల్లో భాగంగా బయటకొచ్చిన అనంతరం కమల్‌ మీడియాతో మాట్లాడారు.

ఇరుపక్షాల తరపున ప్రభుత్వ పెద్దగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రాజగోపాలన్ వ్యవహరించారు. ఈ నెల 1న చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే కమల్ చెన్నైలో లేనందున చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయూరుు. రెండో విడత చర్చలు శనివారం జరిగాయి. కమలహాసన్ సచివాలయానికి వస్తున్నారన్న సమాచారంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియా ప్రతినిధులు, 2.30 గంటలకు ముస్లిం మత పెద్దలు, 2.45 గంటలకు కమలహాసన్, హోంశాఖ కార్యద ర్శి రాజగోపాలన్ సచివాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చర్చలు ప్రారంభమయ్యూయి. రాత్రి 8 గంటలకు కమలహాసన్ బయటకు వచ్చి చర్చలు ముగిసినట్లు ప్రకటించారు.

మొదటి మాటలోనే సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. సానుకూల వాతావరణంలో చర్చలు సాగినట్లు వెల్లడించారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత మళ్లీ కలుగజేసుకుని 'అభిమానులకు శుభవార్త, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తా' అన్నారు. ప్రతి రోజూ నన్ను చూపిస్తూ, నా మాటలు వినిపించిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. కమల్ ప్రకటనతో అభిమానులు సంతోషంలో మునిగిపోయూరు. చిత్రాన్ని తిలకించేందుకు తామంతా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X