»   » షాకింగ్ న్యూస్: 'విశ్వరూపం' ఫస్ట్ డే.. ఫస్ట్ షో టీవీల్లో

షాకింగ్ న్యూస్: 'విశ్వరూపం' ఫస్ట్ డే.. ఫస్ట్ షో టీవీల్లో

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: విశ్వనటుడు కమల్‌ హసన్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విశ్వరూపం'. ప్రతీ విషయంలోనూ విభిన్నతను ప్రదర్శించే కమల్ ఈ సారి ఈ చిత్రం మార్కెటింగ్ విషయంలోనూ కొత్త దారిలో వెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో మొదటి రోజే ప్రసారం చేసేందుకు హక్కులు ఇవ్వటానికి సిద్దపడి టీవీ ఛానెల్స్ వారితో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  ఇలా టీవీల్లో మొదటి రోజు ప్రసారం చేసే నిర్ణయం తీసుకోవటానికి కారణం.. ఆయన అనుకున్న బిజినెస్... వంద కోట్లు రీచ్ కాకపోవటమే అని తెలుస్తోంది. గత ఆరు నెలలుగా ఆయన ఈ చిత్రం బిజినెస్ కోసం రకరకాలుగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన అనుకున్న రేంజికి బిజినెస్ సాగటం లేదు. దాంతో ఇలా టీవీ ఛానెల్స్ లో ప్రసారం చేయటం ద్వారా..యాభై కోట్ల వరకూ డీల్ జరపవచ్చని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టాటా స్కై, డిష్ టీవీ, రిలియన్స్, ఎయిర్ టెల్ వారు ఈ చిత్రం టీవీ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ రోజే ఈ చిత్రం టీవిల్లో రావటంతో మంచి టీఆర్పిలు వస్తాయి కాబట్టి బాగా బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.

  అయితే ఇలా అయితే థియోటర్స్ కు వచ్చి తమ చిత్రం ఎవరు చూస్తారని థియోటర్స్ వారు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆడియో విడుదల రోజు కమల్ ఈ ప్లాన్ ని తెలియచేస్తారని సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఇప్పుడు ఏకమై కమల్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.చిత్రం థియోటర్ విడుదలను అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

  తన చిత్రాల్లో ఎన్నో కొత్త విషయాలను స్పృశించే కమల్‌.. ఇందులో తీవ్రవాద ఇతివృత్తాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. తీవ్రవాదులను ఏరిపారేసి ఆపరేషన్‌ టీంకు అధిపతిగా, నృత్య దర్శకుడిగా ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా గత ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. అత్యున్నత సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వటంతో డిసెంబరుకు వాయిదా వేశారు. జనవరి 11వ తేదీని ఇటీవల ఖరారు చేశారు.

  'విశ్వరూపం' తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం.

  English summary
  Kamal Hassan devised a new plan wherein he would be releasing Vishwaroopam exclusively on television simultaneously in Hindi, Tamil and Telugu. All major television networks were contacted for this and a deal of Rs 50 crore was signed. As per this deal Vishwaroopam will be screened on DTH (Tata Sky, Dish TV, Reliance and Airtel) on the same day as its theatrical release.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more