కమల్ హాసన్ ‘విశ్వరూపం’ ఫస్ట్‌లుక్!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజా చిత్రం 'విశ్వరూపం' తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. జూలై నెలలో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో కమల్ హాసన్ ఆర్మీ జనరల్‌గా నటిస్తున్నారు. టెర్రరిజం దాని పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో టెర్రరిస్ట్‌గా రాహుల్ బోస్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను గజగజలాడిస్తున్న ఉగ్రవాదాన్ని అంతమొందించే కథతో రూపొందిన ఈ చిత్రం తమిళ,హిందీతో పాటు పలు భాషల్లోకి అనువాదం కానుంది.
దశావతారం'లో పది పాత్రలు పోషించి మెప్పించిన కమల్ మళ్ళీ ఆ స్థాయి చిత్రంలో నటించలేదు. 'దశావతారం' తరువాత నుంచి ఆయన మదిలో మెదిలిన ఆలోచనలకు ప్రతిరూపమే ఇప్పుడు రూపొందుతున్న 'విశ్వరూపం'. కమల్ హాసన్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబు అవుతోంది.
ఈ చిత్రంలో పూజా కుమార్ నాయికగా నటించగా ఆండ్రియా, జరీనా వహాబ్, శరత్ చక్రవర్తి, శేఖర్ కపూర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.వి.పి. సినిమాస్ నిర్మాణ భాగస్వామి. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతాన్ని సమకూర్చారు. 'దిల్ చాహ్‌తా హై' వంటి సూపర్ మ్యూజికల్ హిట్‌ను అందించిన ఈ సంగీత దర్శకత్రయం 'విశ్వరూపం'ను కూడా సంగీత సంచలనంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఎన్నో అంచనాలతో వస్తున్న 'విశ్వరూపం' చిత్రం దేశ సినీ చరిత్రంలో ఓ సంచలన చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. మరి కమల్ హాసన్ ఆ అంచనాలను ఎంత వరకు రీచ్ అవుతారో..?


Click it and Unblock the Notifications











