twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ డే, ఫస్ట్ షో వాళ్లూ ఎంజాయ్ చేయాలిగా... లేడీ ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో!

    |

    తమ అభిమాన హీరో సినిమా విడుదలైందంటే థియేటర్లో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తెర ముందు డాన్సులు చేస్తూ... కాగితాలు గాల్లోకి విసురుతూ... ఎంజాయ్ చేస్తారు. తమకు ఇష్టమైన సీన్లు వచ్చినపుడు విజిల్స్ వేస్తూ, గట్టిగా అరుస్తూ గోల గోల చేస్తారు.

    బాయ్స్‌ మాత్రమే కాదు... గర్ల్స్ కూడా అలా ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ వారు అలా స్వేచ్ఛగా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తమిళ హీరో అజిత్ లేడీ అభిమానుల కోసం స్పెషల్ షోలు వేయిస్తున్నారు. ఆయన నటించిన 'విశ్వాసం' జనవరి 14న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

    అజిత్‌కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే...

    అజిత్‌కు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే...

    హీరో అజిత్‌కు తమిళనాడులో లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరునిరవూర్, తిరువల్లూర్ జిల్లాల్లో లేడీ అభిమానులు ఫస్ట్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వీలుగా వారికి ప్రత్యేకంగా షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

    అజిత్ సూచన మేరకే..

    అజిత్ సూచన మేరకే..

    తన లేడీ అభిమానుల నుంచి చాలా రోజుల నుంచి ఇలాంటి విజ్ఞప్తులు వస్తుండటంతో అజిత్ సినిమా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి ఈ స్పెషల్ షోలు ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. మరి ఈ షోలకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

    భారీ అంచనాలు

    భారీ అంచనాలు

    గతంలో అజిత్ నటించిన వీరం, వేదాలం, వివేగం సినిమాలను తెరకెక్కించిన సిరుతై శివ దర్శకత్వంలో ‘విశ్వాసం' తెరకెక్కింది. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను పండగ మూడ్లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

    ముఖ్య పాత్రల్లో...

    ముఖ్య పాత్రల్లో...

    ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. సత్యరాజ్‌, ప్రభు గణేశన్‌, సంపత్‌రాజ్‌, యోగిబాబు, వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందించారు.

    English summary
    Ajith upcoming film Viswasam releasing on Jan 14th of this month. The theater owners in Thiruniravur, Thiruvallur district are organizing 'Viswasam' special show exclusively for the women to enjoy the first day celebrations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X