twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vivek died due to Cardiac Arrest: కొడుకు మృతి విషాదం నుంచి తేరుకొని.. అంతలోనే ఈ లోకాన్ని వీడిన వివేక్..

    |

    అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు హాస్యాన్ని పంచిన ప్రముఖ నటుడు వివేక్‌ జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు ఉన్నాయి. జీవితంలో కింద పడిన ప్రతీసారి అదే వేగంతో నిలబడ్డారని తన సన్నిహితులు, స్నేహితులు చెప్పుకొంటారు. ఎలాంటి విషాదాన్నైనా దిగమింగుకొని హాస్యాన్ని పంచడం ఆయనలోని గొప్ప గుణం అంటూ చెప్పుకొంటారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలు..

    బాలచందర్ అగ్ని పరీక్షను అధిగమించి

    బాలచందర్ అగ్ని పరీక్షను అధిగమించి

    నటనపై ఆసక్తి చెన్నై చేరిన వివేక్ మధురై యూనివర్సిటీలో బీకాంలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత వివేక్‌లోని ప్రతిభను పసిగట్టిన మద్రాస్ హ్యూమర్ క్లబ్ వ్యవస్థాపకుడు పీఆర్ గోవింద రాజన్ ప్రముఖ దర్శకుడు కే బాలచందర్‌కు పరిచయం చేశాడు. ఆ సమయంలో వివేక్‌కు బాలచందర్ ఓ అగ్ని పరీక్షను పెట్టారు. 16 క్యారెక్టర్లు ఉన్న స్ట్రిప్టు రాయమని చెప్పి సిట్యుయేషన్ చెప్పగా.. ఒక్కరాత్రిలోనే దానిని పూర్తి చేశారు. దాంతో బాలచందర్‌కు వివేక్ అత్యంత ఆప్తుడిగా మారారు.

     సుహాసినికి సోదరుడిగా ఎంట్రీ

    సుహాసినికి సోదరుడిగా ఎంట్రీ

    బాలచందర్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే 1987లో మనథిల్ ఉరుతి వేండమ్ అనే చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. ఆ చిత్రంలో సుహాసినికి సోదరుడిగా నటించారు. ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వం వహించిన పుదు పుదు ఆర్తంగళ్, ఓరు వీడు ఇరు వాలస్ చిత్రాల్లో నటించారు. రజనీకాంత్‌తో ఉజైపల్లి, వీర చిత్రాల్లో నటించి మెప్పించారు.

     వివేక్ అసలు పేరు ఏమిటంటే..

    వివేక్ అసలు పేరు ఏమిటంటే..

    కోట్లాది మందికి తనదైన హాస్యంతో చేరువైన కమెడియన్ వివేక్ అసలు పేరు వివేక్‌నందన్. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలోని కోవిల్‌పట్టి జిల్లాలో 1961 నవంబర్ 19వ తేదీన జన్మించారు. ఆయనకు భార్య అరుల్ సెల్వి, ఇద్దరు కూతుళ్లు అమృత నందిని, తేజస్విని ఉన్నారు. ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ ఇటీవలే మరణించారు.

     బ్రెయిన్ ఫీవర్‌తో కుమారుడు మృతి

    బ్రెయిన్ ఫీవర్‌తో కుమారుడు మృతి

    వివేక్‌ కుమారుడు ప్రసన్న కుమార్‌ కొద్ది సంవత్సరాల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ ఫీవర్ అని నిర్ధారించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే వివేక్ కుమారుడు మరణించాడు. దాంతో వివేక్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ విషాదం నుంచి కోలుకోంటున్న సమయంలో వివేక్ గుండెపోటుతో ఈ లోకాన్ని వీడటం మరింత విషాదంగా మారింది.

    Recommended Video

    Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu

    English summary
    Vivek died due to Cardiac Arrest: Vivekanandan, known by his stage name Vivek, is an Indian film actor, comedian, television personality, playback singer and activist working in the Tamil film industry. Introduced in films by director K. Balachander, he has won 3 times the Best Comedian – Tamil for his performances in movies such as Run, Saamy, Perazhagan and 5 times for Tamil Nadu State Film Award for Best Comedian
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X