Vivek no more: ఆ కల తీరకుండానే తిరిగిరాని లోకాలకు.. వివేక్ ప్రారంభించిన గ్రీన్ కలాం గురించి తెలుసా?
ప్రముఖ నటుడు, కమెడియన్ వివేక్ ఆకస్మిక మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. రెండు రోజుల ముందు వరకు నవ్వుతూ.. అందర్నీ నవ్విస్తూ కనిపించిన వివేక్ విగతజీవిగా మారడంపై అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి తీరని లోటు అంటూ సంతాపం సందేశాల్లో పేర్కొంటున్నారు. వివేక్ వ్యక్తిగత జీవితం గురించి వివరాల్లోకి వెళితే...
చిరుత పిల్ల నేహా శర్మ అందాల బికినీ షో

ప్రభుత్వ ఉద్యోగిగా జీవితం..
వివేక్ ప్రొఫెషనల్ జీవితం గురించిన వివరాల్లోకి వెళతే.. తమిళనాడు సెక్రెటేరియట్‌లో ప్రభుత్వం ఉద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలోనే మద్రాస్ హ్యుమర్ క్లబ్‌లో ప్రదర్శనలు ఇస్తూ హాస్యాన్ని ఇతరులకు పంచేవారు. ఆ క్రమంలోనే వివేక్‌ను ప్రముఖ దర్శకులు కే బాలచందర్ సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు.

చిన్న కలైవనర్‌గా ప్రేక్షకులకు చేరువై
తమిళ పరిశ్రమలో కలైవనర్ అనే ప్రముఖ హాస్య నటుడిని అనుకరిస్తూ వందలాది చిత్రాల్లో నటించారు. తన నటన, హాస్యం ద్వారా సమాజానికి సందేశాలు ఇస్తూ వస్తున్నారు. ఆయన ఉపయోగించే సింగిల్ లైనర్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అందుకే ఆయనను తమిళ సినిమా పరివ్రమలో చిన్న కలైవనర్ అని ముద్దుగా తమిళ సినీ పరిశ్రమ పిలుచుకొనేది.

తొలిసారి కమల్ హాసన్‌తో ఇండియన్ 2లో
తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించిన అనతికాలంలోనే దక్షిణాదిలోని అగ్రహీరోలందరితో నటించారు. రజనీకాంత్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, మాధవన్, ధనుష్, శింబు నటించారు. కమల్ హాసన్‌తో నటించాలనే కోరిక కలిగిన వివేక్ చివరిగా ఇండియన్ 2 చిత్రంలో ఆయనతో నటించారు. కానీ ఆ సినిమాను తెర మీద చూసుకోకుండానే కన్నుమూశారు. కమల్ పక్కన నటించాలనే కోరిక తీరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచి వేసింది.

పద్మ శ్రీ అవార్డుతో ఘన కీర్తి
హస్యనటుడిగా ఎన్నో వందల చిత్రాల్లో నటించిన వివేక్.. 2019లో వెల్లై పూకల్ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు.ఆ తర్వాత నాన్ థాన్ బాలా, పలక్కట్టు మాధవన్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. తన జీవిత కాలంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొన్నారు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.
Recommended Video

గ్రీన్ కలామ్ ప్రాజెక్టుతో
సినిమాలే కాకుండా వివేక్‌కు సామాజిక సృహ కూడా ఎక్కువేనని ఆయన స్నేహితులు చెప్పుకొనే వారు. ప్రతీ పల్లె పచ్చదనంతో కళకళలాడాలని తాపత్రయపడ్డారు. తమిళనాడులో కోటి మొక్కలు నాటాలనే కలతో గ్రీన్ కలామ్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. పలు జిల్లాలో మొక్కలను నాటే అద్బుతమైన కార్యక్రమాన్ని తన భుజాన వేసుకొన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరణించడం విషాదంగా మారింది.


Click it and Unblock the Notifications